HomeTop StoriesAssembly : ప్రజాహిత పాలన.. అసెంబ్లీలో 'ప్రజా విశ్వాసం' బిల్లు

Assembly : ప్రజాహిత పాలన.. అసెంబ్లీలో ‘ప్రజా విశ్వాసం’ బిల్లు

Telangana Praja Viswasam Bill : రాష్ట్రంలో సులభతర వాణిజ్యానికి పెద్దపీట వేస్తూ శాసనసభలో ‘తెలంగాణ ప్రజా విశ్వాసం (నిబంధనల సవరణ) బిల్లు’ను ఐటీ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు లాంఛనంగా ప్రవేశపెట్టారు. కేంద్ర ‘జన్ విశ్వాస్’ చట్టం స్ఫూర్తితో ఈ ముసాయిదాను రూపొందించారు.

- Advertisement -

హేతుబద్ధీకరణతో ఊరట: కేంద్ర, రాష్ట్ర చట్టాల పరిధిలోని స్వల్ప, సాంకేతిక లోపాలను క్రిమినల్ పరిధి నుంచి తప్పించడమే ఈ బిల్లు ముఖ్య ఉద్దేశమని మంత్రి స్పష్టం చేశారు. నిబంధనల ఉల్లంఘనలకు జైలు శిక్షల భయం లేకుండా కేవలం నామమాత్రపు జరిమానాలతో సరిపెట్టేలా నిబంధనలను సవరించారు.

పెట్టుబడుల స్వర్గధామంగా తెలంగాణ: ఈ సంస్కరణల ద్వారా పాలనలో జవాబుదారీతనం పెరగడమే కాకుండా ప్రజలకు జీవన సౌలభ్యం  పారిశ్రామికవేత్తలకు వ్యాపార సౌలభ్యం  లభిస్తాయని మంత్రి ఉద్ఘాటించారు. అనవసర కోర్టు కేసులు తగ్గి, సమర్థవంతమైన పాలనకు, పెట్టుబడుల ప్రవాహానికి ఇది బాటలు వేస్తుందని ప్రభుత్వం విశ్వసిస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News