HomeTop StoriesHarish Rao: అనుమతులు రద్దంటే..తెలంగాణకు అన్యాయమే

Harish Rao: అనుమతులు రద్దంటే..తెలంగాణకు అన్యాయమే

Telangana: తెలంగాణ రాష్ట్ర సాగు,తాగునీటి ప్రయోజనాలను పణంగా పెట్టేలా ఏపీ ప్రభుత్వం కుట్ర చేస్తోంది.అయినప్పటికీ సీఎం రేవంత్‌ రెడ్డి మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్‌ ముఖ్య నేత,మాజీమంత్రి హరీశ్‌ రావు అన్నారు. ఈ నెల 18న జరగబోతున్న గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఏపీ ప్రయోజనాల కోసమే జరుగుతుందని ఆయన ఆరోపించారు.

- Advertisement -

7 ప్రాజెక్టుల అనుమతులు రద్దు…

తెలంగాణకు చెందిన 7 ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని ఏపీ సర్కార్‌ ప్రతిపాదించినట్లు హారీశ్‌రావు పేర్కొన్నారు. అజెండా ఖరారై వారం రోజులైనా తెలంగాణ ప్రభుత్వం దీని గురించి ఒక్కసారిగా స్పందించకపోవడం ఏంటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడారు.

‘‘రాష్ట్రంలో సాగు, తాగునీటిని దూరం చేసే కుట్ర జరుగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతులు రద్దు చేయడం అంటే తెలంగాణకు అన్యాయం చేయడం కాదా అని అన్నారు. ఏపీ ప్రతిపాదనలను అజెండాలో చేర్చే ముందు తెలంగాణను సంప్రదించరా? జీఆర్‌ఎంబీలో ఉన్న రాష్ట్ర ఇంజినీర్లు మౌనంగా ఎందుకు అంగీకరించారు? రేవంత్‌ దీనికి పరోక్షంగా అంగీకారం తెలిపారా? రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాల్సిన బాధ్యత కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కు లేదా? తెలంగాణ బీజేపీ ఎంపీలు రాష్ట్ర హక్కులు కాపాడేందుకు ముందుకు వస్తారా? కాంగ్రెస్‌ ప్రభుత్వం మూడేళ్లలో కేంద్రం నుంచి ఒక్క ప్రాజెక్టుకూ కూడా అనుమతి తీసుకుని రాలేదు’’ అని హరీశ్‌రావు విమర్శించారు.

Also Read: Hyderabad: డయల్ 100 స్థానంలో కొత్త ఎమర్జెన్సీ నంబర్.. 112 ప్రారంభించిన డీజీపీ

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News