HomeTop StoriesTelangana: లండన్‌లో సత్తా చాటిన తెలంగాణ బిడ్డ.. కౌన్సిలర్‌‌గా విజయం

Telangana: లండన్‌లో సత్తా చాటిన తెలంగాణ బిడ్డ.. కౌన్సిలర్‌‌గా విజయం

London local body elections: లండన్‌ రాజకీయాల్లో తెలంగాణ యువతి సంచలనం నమోదు చేసింది. ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లిన ఓరుగల్లు బిడ్డ.. అక్కడి స్థానిక సంస్థల ఎన్నికల్లో కౌన్సిలర్‌గా గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించింది.

- Advertisement -

విద్యార్థిని నుంచి కౌన్సిలర్‌ వరకు: జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన పూజిత.. లండన్‌లో జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది. పూజిత ఆరున్నర ఏళ్ల క్రితం ఎంఎస్ చదవాలనే లక్ష్యంతో లండన్ వెళ్లారు. చదువు పూర్తయిన తర్వాత అక్కడే ప్రముఖ కంపెనీలో ఉద్యోగంలో చేరారు. అనంతరం అక్కడే స్థిరపడ్డారు. గతేడాది ఫిబ్రవరిలో వరంగల్ జిల్లా ఐనవోలు మండలం ఒంటిమామిడిపల్లి గ్రామానికి చెందిన కడదూరి శ్రీనివాస్‌తో ఆమెకు వివాహం జరిగింది. అనంతరం అత్తగారింటి ప్రోత్సాహంతో లండన్‌ లోకల్ బాడీ ఎన్నికల్లో ద గ్రీన్ పార్టీ తరపున గెలిచారు.

Also read-PM Modi: బెంగాల్‌ విజయోత్సాహం తెలంగాణలో కనిపిస్తోంది- ప్రధాని మోదీ

ఆనందం వ్యక్తం చేస్తున్న పుట్టినిల్లు.. మెట్టినిల్లు: లండన్ గడ్డపై ఒక తెలుగు మహిళ.. కౌన్సిలర్‌గా గెలవడంపై అటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో.. ఇటు వరంగల్ జిల్లా ఒంటిమామిడిపల్లిలో సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. మా ఊరి కోడలు లండన్‌లో లీడర్ కావడం గర్వంగా ఉందని గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News