HomeTop StoriesHYDRA: హైడ్రా రిక్రూట్‌మెంట్‌లో ఉద్రిక్తత.. సరూర్‌నగర్ స్టేడియం వద్ద పోటెత్తిన నిరుద్యోగులు

HYDRA: హైడ్రా రిక్రూట్‌మెంట్‌లో ఉద్రిక్తత.. సరూర్‌నగర్ స్టేడియం వద్ద పోటెత్తిన నిరుద్యోగులు

HYDRA recruitment: తెలంగాణలో తీవ్రస్థాయిలో ఉన్న నిరుద్యోగ సమస్యకు అద్దం పట్టేలా హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ స్టేడియం వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. హైడ్రా (HYDRAA)లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించిన ఫిజికల్ ఈవెంట్స్ భారీ జనసంద్రాన్ని తలపించాయి. మొత్తం 150 పోస్టుల భర్తీకి హైడ్రా అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆగస్టు 8, 9 తేదీల్లో ఉదయం 5 గంటల నుంచే సరూర్‌నగర్ స్టేడియంలో దేహదారుణ పరీక్షలు (ఫిజికల్ ఈవెంట్స్) నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వేలాది మంది నిరుద్యోగ యువకులు శనివారం తెల్లవారుజామునే స్టేడియం వద్దకు భారీగా తరలివచ్చారు.

- Advertisement -

స్టేడియం వద్ద కిక్కిరిసిన నిరుద్యోగులు: హైడ్రా పరిధిలో 100 డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (DRF) అసిస్టెంట్లు, 50 హెవీ వెహికల్ డ్రైవర్ ఉద్యోగాల కోసం వేలాది మంది అభ్యర్థులు సరూర్‌నగర్ స్టేడియం వద్దకు చేరుకున్నారు. దీంతో స్టేడియం గేట్ల వద్ద ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. తొక్కిసలాట వాతావరణం నెలకొంది. నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో పోటెత్తడంతో స్టేడియం ప్రాంగణం కిక్కిరిసిపోయింది. దీంతో జనసందోహాన్ని అదుపు చేయడానికి భద్రతా సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఉద్యోగాల కోసం యువత భారీ సంఖ్యలో క్యూ కట్టడం రాష్ట్రంలో ఉపాధి అవకాశాల కోసం నెలకొన్న పోటీ తీవ్రతను మరోసారి కళ్లకు కట్టింది.

Also Read-Niharika Konidela: బోనాల జాతరలో నిహారిక కొణిదెల సందడి

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News