TET notification: నిరుద్యోగ అభ్యర్థులకు విద్యాశాఖ నుంచి తీపి కబురు అందింది. రాష్ట్రంలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) నిర్వహణకు రేవంత్ సర్కార్ నోటిఫికేషన్ జారీ చేసింది. తాజాగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 15 నుండి 30 వరకు అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఈ ఏడాదిలో ఇది రెండో టెట్ నోటిఫికేషన్ కావడంతో.. డీఎస్సీ (DSC) కోసం సిద్ధమవుతున్న వేలాది మంది అభ్యర్థులకు ఇది ఒక వరంగా మారనుంది.
దరఖాస్తు గడువు: ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపునకు ఏప్రిల్ 15 నుంచి 30 వరకు గడువు ఉంది. ఆసక్తి కల్గిన అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారా మాత్రమే సమర్పించాల్సి ఉంటుంది. ధరఖాస్తు చేసుకోవలనే సాధారణ అభ్యర్థులు ఒక్క పేపర్‌కు రూ. 750 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీలయితే రూ. 750గా నిర్థారించారు. రెండు పేపర్లకు సాధారణ అభ్యర్థులైతే రూ. 1000, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ. 950 చెల్లించాల్సి ఉంటుంది.


