HomeTop StoriesTGSRTC: గుడ్‌ న్యూస్.. కండక్టర్‌ పోస్టుల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌

TGSRTC: గుడ్‌ న్యూస్.. కండక్టర్‌ పోస్టుల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌

TGSRTC: రేవంత్‌ సర్కార్‌ నిరుద్యోగులకు తీపి కబురు అందించింది. రవాణా శాఖలో ఖాళీగా ఉన్న 1,500 కండక్టర్‌ పోస్టుల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) యాజమాన్యమే నేరుగా ఈ నియామక ప్రక్రియను చేపట్టనుంది.

- Advertisement -

పదో తరగతి మార్కుల ఆధారంగా ఎంపిక: ఈ కండక్టర్ పోస్టుల భర్తీకి సంబంధించి ఎంపిక ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరగనున్నట్లు తెలుస్తోంది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా కేవలం పదో తరగతిలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు సమాచారం. ప్రభుత్వం నుంచి అధికారికంగా అనుమతి లభించడంతో, నోటిఫికేషన్ విడుదల మరియు నియామక ప్రక్రియపై ఆర్టీసీ యాజమాన్యం కసరత్తు ప్రారంభించింది.

Also read-Bank Jobs: నిరుద్యోగులకు అలర్ట్.. IBPS నుంచి భారీ నోటిఫికేషన్!

ప్రత్యేక రాష్ట్రంలో ఇదే తొలిసారి: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి, టీజీఎస్‌ఆర్టీసీ ఆవిర్భవించిన తర్వాత ఇప్పటివరకు కండక్టర్‌ పోస్టుల భర్తీకి ఎలాంటి నేరుగా నోటిఫికేషన్లు రాలేదు. ప్రతి ఏటా వందలాది మంది కండక్టర్లు రిటైర్మెంట్ పొందుతుండటంతో సంస్థలో ఖాళీల సంఖ్య భారీగా పెరిగింది. సిబ్బంది కొరతను అధిగమించడానికి గతంలో హైదరాబాద్, సికింద్రాబాద్‌ సహా వివిధ రీజియన్ల పరిధిలోని డిపోల్లో ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో తాత్కాలికంగా కండక్టర్లను నియమించారు. ప్రస్తుతం ప్రభుత్వ నిర్ణయంతో 1,500 మందికి శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. త్వరలోనే ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి అర్హతలు, దరఖాస్తు తేదీలతో కూడిన అధికారిక నోటిఫికేషన్‌ను ఆర్టీసీ విడుదల చేయనుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News