HomeTop StoriesSarpanch: నేటితో ముగియనున్న సర్పంచుల పాలనకాలం.. రంగంలోకి అధికారులు!

Sarpanch: నేటితో ముగియనున్న సర్పంచుల పాలనకాలం.. రంగంలోకి అధికారులు!

Sarpanch elections: ఏపీలోని గ్రామ పంచాయతీల ఐదేళ్ల పాలనా కాలం గురువారంతో అధికారికంగా ముగియనుంది. 2021లో ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యుల పదవీ కాలం ఏప్రిల్ 2తో పూర్తి అవుతుండడంతో గ్రామాల్లో పాలన కుంటుపడకుండా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 3 ఉదయం నుంచి పంచాయతీల బాధ్యతలను ప్రత్యేకాధికారులు(Special Officers) స్వీకరించనున్నారు.

- Advertisement -

కీలక బాధ్యతల్లో గెజిటెడ్ అధికారులు: గ్రామాల్లో పరిపాలన సజావుగా సాగేందుకు ప్రభుత్వం తహశీల్దార్లు, ఎంపీడీఓలు (MPDO), ఎంఈఓలు (MEO) మరియు ఇతర గెజిటెడ్ స్థాయి అధికారులకు అడ్మినిస్ట్రేటివ్ బాధ్యతలను అప్పగించింది. జిల్లా కలెక్టర్లు ఇప్పటికే తమ పరిధిలోని గ్రామాలకు అధికారులను కేటాయిస్తూ నియామక ప్రక్రియను పూర్తి చేశారు. పారిశుధ్యం, తాగునీటి సరఫరా, నిధుల విత్‌డ్రా వంటి అత్యవసర విధులను ఇకపై ఈ ప్రత్యేకాధికారులే పర్యవేక్షిస్తారు.

సర్పంచులకు ఆదేశాలు: సర్పంచుల పదవీ కాలం ముగియడంతో తమ వద్ద ఉన్న రికార్డులను మరియు చెక్ పవర్ బాధ్యతలను వెంటనే సంబంధిత అధికారులకు అప్పగించాలని ప్రభుత్వం ఆదేశించింది. కొత్తగా ఎన్నికలు జరిగి, పాలకవర్గాలు కొలువుదీరే వరకు ఈ వ్యవస్థే కొనసాగనుంది.

Also read-War effect: కండోమ్ల కొరత.. వైద్య నిపుణుల హెచ్చరిక!

ఎన్నికలపై ఉత్కంఠ: సర్పంచుల పదవీ కాలం ముగియడంతో రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికల వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో తదుపరి పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అంతవరకు గ్రామాల్లో అభివృద్ధి పనులు, ఇతర పరిపాలన అంతా ప్రత్యేకాధికారుల పర్యవేక్షణలోనే సాగనుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News