HomeTop StoriesTMC: మమతా బెనర్జీకి మరో షాక్‌.. టీఎంసీ ఎంపీ సుష్మితా దేవ్ రాజీనామా!

TMC: మమతా బెనర్జీకి మరో షాక్‌.. టీఎంసీ ఎంపీ సుష్మితా దేవ్ రాజీనామా!

MP Sushmita Dev: పశ్చిమ బెంగాల్‌లో ఇటీవల అధికారం కోల్పోయిన మమతా బెనర్జీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో రాజీనామాల పర్వం కలకలం రేపుతోంది. తాజాగా టీఎంసీ సీనియర్ నాయకురాలు, రాజ్యసభ ఎంపీ సుస్మితా దేవ్ తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆమె తన రాజీనామా లేఖను పార్టీ అధిష్ఠానానికి పంపారు.

- Advertisement -

ఒకే వారంలో రెండో వికెట్ డౌన్‌: టీఎంసీలో అంతర్గత పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఒకే వారంలో పార్టీని వీడిన రెండో రాజ్యసభ సభ్యురాలిగా సుస్మితా దేవ్ నిలిచారు. కాగా ఇదే వారంలో సీనియర్ నేత సుఖేందు శేఖర్ రాయ్ సైతం తన రాజ్యసభ సభ్యత్వానికి, పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన వెళ్లిన కొద్ది రోజులకే సుస్మితా దేవ్ సైతం అదే బాట పట్టడం బెంగాల్ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వరుస రాజీనామాల నేపథ్యంలో రాజ్యసభలో తృణమూల్ కాంగ్రెస్ బలం క్షీణించింది.

Also read-NDA : నేడు ఎన్డీయే భేటీ.. ప్రధాని మోదీకి అభినందనల తీర్మానం ప్రవేశపెట్టనున్న చంద్రబాబు!

బెంగాల్ రాజకీయాల్లో తీవ్ర కలకలం: వరుసగా ఇద్దరు కీలక రాజ్యసభ ఎంపీలు తృణమూల్ కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పడంతో పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. వచ్చే రోజుల్లో పార్టీ నుంచి మరికొందరు నేతలు బయటకు వచ్చే అవకాశం ఉందనే ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే అధికారం కోల్పోయిన దీదీకి వరుస రాజీనామాలు కలవరపెడుతున్నాయి.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News