Thursday, January 22, 2026
HomeTop StoriesiBomma: 'ఐ బొమ్మ' రవి వెనుక చీకటి కోణం.. సినిమా వాళ్లే ఉన్నారా?

iBomma: ‘ఐ బొమ్మ’ రవి వెనుక చీకటి కోణం.. సినిమా వాళ్లే ఉన్నారా?

iBomma: ‘ఐ బొమ్మ’ రవి .. ప్రస్తుతం ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యావత్‌ చిత్ర పరిశ్రమలను కుదుపేస్తుంది. ముఖ్యంగా టాలీవుడ్‌(Tollywood)ను అతలాకుతలం చేస్తుంది. పైరసీ మాఫియా(Piracy mafia)ను నడుపుతూ దమ్ముంటే పట్టుకోండని సవాల్‌ చేసిన ఇమ్మడి రవిని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్‌ చేశారు. అయితే ఇప్పుడే అసలైన సినిమా మొదలైంది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఉండే అంతర్గత విభేదాలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల హైదరాబాద్ సీపీ సజ్జనార్(Hyderabad CP Sajjanar).. కొందరు సినీ ప్రముఖులతో పెట్టిన ప్రెస్‌ మీటే టాలీవుడ్ అంతర్గత వైరుధ్యాలను స్పష్టం చేశాయని పలువురు విశ్లేషకులు అంటున్నారు. అంతేకాదు.. ‘ఐ బొమ్మ'(i Bomma) తెరవెనుక తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులే ఉన్నారనే అనుమానాలను సైతం వ్యక్తం అవుతున్నాయి. అయితే ఆ అనుమానాల వెనుక దాగి ఉన్న.. విస్తుపోయే నిజానిజాలను ఇప్పుడు తెలుసుకుందాం.

- Advertisement -

‘ఐ బొమ్మ’ తెర వెనుక చీకటి కోణం: ఆన్‌లైన్‌లో ఉచితంగా కొత్త సినిమాలను అందించే ప్లాట్‌ఫామ్ ‘ఐ బొమ్మ'(iBomma). ఒకప్పుడు ఇది కేవలం సాధారణ పైరసీ వెబ్‌సైట్‌ మాత్రమే. కానీ దీని నిర్వాహకుడైన ఇమ్మడి రవి అరెస్ట్‌ కావడంతో విస్తుపోయే నిజాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇటీవల సీపీ సజ్జనార్‌ ప్రెస్‌మీట్‌లో చెప్పిన కొన్ని విషయాలను నిశితంగా పరిశీలిస్తే.. ‘ఐ బొమ్మ రవి’ మాస్టర్ మైండ్ వెనుక ఎవరైనా సినీపెద్దలు ఉన్నారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే ఐ బొమ్మ కార్యకలాపాల తీరు సాధారణ పైరసీ సైట్ల కంటే భిన్నంగా ఉందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ సినిమాలు విడుదలైన కొన్ని గంటల్లోనే హెచ్‌డీ క్వాలిటీతో సైట్లో అందుబాటులోకి వస్తున్నాయి. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా తెలుగు సినిమాలు మాత్రమే ఇంత క్వాలిటీతో ఆన్‌లైన్‌లో ఉంటున్నాయి. అంతేకాకుండా చాలా వేగంగా ‘ఐ బొమ్మ’ వెబ్‌సైట్‌లోకి వస్తున్నాయి. ఇంత వేగం, క్వాలిటీతో సినిమాలు వెబ్‌సైట్‌లోకి వస్తున్నాయంటే.. ‘ఐ బొమ్మ’ తెరవెనుక వెనుక ఏదో పెద్ద మాఫియానే ఉందనేది నగ్నసత్యం. అయితే ఆ మాఫియాలో సినీ పెద్దలు ఎవరైనా ఉన్నారా? అనేదే ఇక్కడ అసలైన ప్రశ్న. అయితే దీనికి సమాధానం పోలీసుల విచారణలోనే తేలాలి.

పైరసీ మూలాల్లో అనేక అనుమానాలు: పైరసీ భూతంతో గత కొన్నేళ్లుగా సినీ పరిశ్రమకు ప్రశాంతత లేకుండా చేస్తున్న ‘ఐ బొమ్మ’ కారణంగా సినీపరిశ్రమకు వేల కోట్ల మేర నష్టం వాటిల్లింది. అయితే ఈ నష్టానికి ప్రధాన కారణం ఇమ్మడి రవి అయినప్పటికీ.. పైరసీ మూలాల్లోని చిన్న చిన్న విషయాలు అనేక అనుమానాలకు తావిస్తోంది. తల్లి పాలు తాగి రొమ్మును గుద్దినట్లుగా సినీ పరిశ్రమలో ఉంటూ.. ఆ పరిశ్రమపైనే కొందరు వ్యక్తులు సీతకన్నేశారనేది నగ్నసత్యం. తమకు సంబంధించిన సినిమాలు కాకుండా.. ప్రత్యర్థుల సినిమాలు లీకైనప్పుడు పరిశ్రమలో నెలకొనే నిశ్శబ్దమే ఈ అనుమానాలకు మరింత బలాన్ని చేకూరుస్తుంది.

Also read:https://teluguprabha.net/telangana-news/cybercrime-police-blocked-ibomma-and-bappam-websites/

పైరసీ థియేటర్ వ్యవస్థకు మరణ శాసనం: ‘ఐ బొమ్మ’ వంటి పైరసీ ప్లాట్‌ఫామ్‌లు కేవలం నిర్మాతలకే కాదు.. థియేటర్ యజమానులకూ మరణ శాసనం వంటిదే. సాధారణంగా ఒక సినిమా ఓటీటీలోకి రావడానికి కనీసం నాలుగు వారాలు పడుతుంది. కానీ ఐ బొమ్మలో సినిమా విడుదలైన మొదటి వారంలోనే అందుబాటులోకి వస్తుంది. దీంతో థియేటర్‌కు వచ్చి సినిమా చూసే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది. ముఖ్యంగా చిన్న, మధ్యస్థాయి సినిమాలైతే కోలుకోలేని నష్టాలను చవిచూస్తున్నాయి. ఎందుకంటే సినిమా టికెట్ల ధరలు, పాప్‌కాన్‌ ధరలు పెరిగిన నేపథ్యంలో ప్రేక్షకులు ఉచితంగా సినిమా చూసే అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్నారు. అందుకే పేద మధ్యతరగతి సినీప్రేమికులను ‘ఐ బొమ్మ’ వంటి పైరసీ ప్లాట్‌ఫామ్‌లు ఆకర్షిస్తున్నాయి. దీంతో ‘ఐ బొమ్మ రవి’ని సాధారణ ప్రజలు రాబిన్‌హుడ్‌గా చూస్తున్నారు.

కళామ్మ తల్లి బతకాలంటే: తెలుగు సినిమా పరిశ్రమ శతాబ్దాలపాటు కళకళలాడాలంటే.. ముందుగా సినీ పెద్దలు తమ అంతర్గత విభేదాలను పక్కన పెట్టాలి. ఐకమత్యంతో లీకేజీలకు మూలకారణం అయిన అంశాలపై దృష్టి సారించాలి. లేదంటే ఐ బొమ్మ లాంటి వేదికలు తెలుగు సినీ పరిశ్రమను కుప్పకూల్చే ప్రమాదం ఉంది. పోలీసులు సైతం ‘ఐ బొమ్మ రవి’ విషయంలో అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలి.పైరసీ వెబ్‌సైట్లు, బెట్టింగ్‌ యాప్స్‌కు సంబంధించిన అంశాలలో ఇమ్మడి రవి వెనుకు ఉన్న పెద్ద తలకాయలను గుర్తించాలి. లేదంటే కళామ్మతల్లి నీడలో బతికే నటీనటులు, దర్శకులు, రచయితలు, కవులు, కార్మికులు మరీ ముఖ్యంగా చిన్న చిన్న నిర్మాతలు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News