HomeTop StoriesCaste survey: తెలంగాణలోని టాప్‌-5 కులాలు ఏంటో మీకు తెలుసా?

Caste survey: తెలంగాణలోని టాప్‌-5 కులాలు ఏంటో మీకు తెలుసా?

Telangana caste survey: రేవంత్‌ సర్కార్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, రాజకీయ మరియు కుల సర్వే విజయవంతంగా పూర్తి అయ్యిందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. రాష్ట్రంలోని మొత్తం 1,12,36,849 కుటుంబాలను లక్ష్యంగా పెట్టుకుని చేపట్టిన ఈ సర్వే 97.1 శాతం పూర్తయిందని అన్నారు. మొత్తం జనాభా సుమారు 3.55 కోట్లుగా ఉన్నట్లు పూర్తి వివరాలను వెల్లడించారు. తాము సేకరించిన ఈ ప్రామాణికమైన డేటాను కేంద్ర ప్రభుత్వం సైతం పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.

- Advertisement -

రాష్ట్ర జనాభాలో బీసీలు 56.36 శాతం: తెలంగాణ ప్రభుత్వం వెల్లడించిన సర్వేను గమనిస్తే రాష్ట్రంలో బీసీల జనాభా అత్యధికంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. మొత్తం జనాభాలో బీసీలు 56.36 శాతంగా ఉన్నారు. ఎస్సీలు 17.42 శాతం, ఎస్టీలు 10.43 శాతం మరియు ఓసీ వర్గాలు 15.79 శాతంగా నమోదైనట్లుగా తెలిపారు. అంతేకాకుండా మరో 4శాతం మంది ప్రజలు తమకు ఎలాంటి కులం లేదని (No Caste) పేర్కొన్నారు.

మాదిగ సామాజిక వర్గానిదే టాప్‌: తెలంగాణలో కులాల వారగా వివరాలను పరిశీలిస్తే పలు ఆసక్తికర విషయాలు వెల్లడవుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా మాదిగ సామాజిక వర్గం జనాభా 36.58 లక్షల మంది ఉన్నారు. అంటే మొత్తం జనాభాలో 10.3 శాతం మాదిగ వర్గం వారే ఉన్నారు. ఇక రాష్ట్రంలోని టాప్‌ కులాలను పరిశీలిస్తే ఈ కింది విధంగా ఉన్నాయి.

తెలంగాణలో అత్యధిక జనాభా ఉన్న టాప్ 20 కులాలు (జనాభాతో సహా):

1. మాదిగ- 36,57,551 (10.3%)

2. ముదిరాజ్- 26,39,027 (7.4%)

3. లంబాడీ / బంజారా- 24,04,056 (6.8%)

4. యాదవ – 20,18,725 (5.7%)

5. రెడ్డి- 17,10,244 (4.8%)

6. గౌడ్ – 16,30,187 (4.6%)

7. మాల- 14,71,514 (4.1%)

8. మున్నూరు కాపు- 13,75,018 (3.9%)

9. పద్మశాలి- 11,82,252 (3.3%)

10. రజక- 9,95,972 (2.8%)

11. కురుమ / కురుబ – 7,95,822 (2.2%)

12. ఒడ్డు / వడ్డెర- 6,43,571 (1.8%)

13. ముస్లింలు- 6,32,782 (1.8%)

14. అగ్నికులక్షత్రియ- 5,27,119 (1.5%)

15. కొమటి / వైశ్య – 5,08,813 (1.4%)

16. నాయి బ్రాహ్మణ్- 4,33,785 (1.2%)

17. కుమ్మర- 4,31,363 (1.2%)

18. కొయ- 4,28,142 (1.2%)

19. వడ్రంగి – 4,07,927 (1.1%)

20. గోండ్- 3,81,895 (1.1%)

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News