HomeTop StoriesTPCC: ప్రియాంక గాంధీతో టీపీసీసీ మహేష్ కుమార్ భేటీ.. కీలక మార్పులకు సంకేతమా?

TPCC: ప్రియాంక గాంధీతో టీపీసీసీ మహేష్ కుమార్ భేటీ.. కీలక మార్పులకు సంకేతమా?

TPCC Mahesh Kumar: రాజ్యసభ ఎన్నికల్లో భాగంగా మీనాక్షీనటరాజన్ నామినేషన్ తిరస్కరణ వివాదం ఇప్పుడు తెలంగాణ రాజకీయాలను కుదుపేలా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ(Priyanka Gandhi)తో టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్(TPCC Mahesh Kumar) దిల్లీలో సమావేశం అయ్యారు. ఈ భేటీలో తెలంగాణలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఇరు నేతలు సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది.

- Advertisement -

కఠిన నిర్ణయాలు తీసుకునే ఛాన్స్‌: రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలతో పాటు రాబోయే రోజుల్లో అనుసరించాల్సిన భవిష్యత్ కార్యాచరణపై ఈ భేటీలో చర్చ జరిగినట్లు పార్టీ వర్గాల సమాచారం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, పార్టీని ప్రజలకు మరింత చేరువ చేసేలా వినూత్న కార్యక్రమాలను రూపొందించడంపై నేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. అయితే ఈ సందర్భంగా పలు అంశాల్లో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిందేనని.. ఇరు నేతలు చర్చించినట్లు తెలుస్తోంది.

సీరియస్‌ యాక్షన్‌కు సిద్ధమైన అధిష్ఠానం: ఈ భేటీలో మీనాక్షీ(Meenakshi natarajan) నామినేషన్ తిరస్కరణ అంశాన్ని చర్చించినట్లు తెలుస్తోంది. ఇది బీజేపీ(BJP) కుట్రనా లేదా పార్టీలో ఏర్పడిన అంతర్గత కుట్రల వల్ల చేజారిందా అనే అంశంపై చర్చ జరిగినట్లు తెలుస్తుంది. కేసు అంశాన్ని కోవర్టులే బీజేపీ నేతలకు చెప్పినట్లు తెలిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు అధిష్ఠానం సిద్ధమైనట్లు తెలుస్తోంది.

Also read-Congress: మీనాక్షీనటరాజన్ వివాదంపై అధిష్ఠానం సీరియస్‌.. కీలక నేతలపై అనుమానం?

భేటీపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి: రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ప్రియాంక గాంధీతో టీపీసీసీ చీఫ్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. రాబోయే రోజుల్లో తెలంగాణ కాంగ్రెస్‌లోనూ, అటు రాష్ట్ర రాజకీయాల్లోనూ ఈ భేటీ కీలక మార్పులకు దారి తీసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజం నింపేలా అధిష్ఠానం త్వరలోనే కీలక దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News