HomeTop StoriesKalvakuntla Kavitha: బండి భగీరథ్ కేసు.. బీఆర్ఎస్ తీరుపై కవిత తీవ్ర ఆగ్రహం!

Kalvakuntla Kavitha: బండి భగీరథ్ కేసు.. బీఆర్ఎస్ తీరుపై కవిత తీవ్ర ఆగ్రహం!

TRS President Kavitha: బండి భగీరథ్ కేసుకు సంబంధించిన వ్యవహారంలో టీఆర్‌ఎస్‌ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బండి భగీరథ్ కేసు విషయంలో బీఆర్ఎస్ పార్టీ అనుసరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఒక యువతి వ్యక్తిగత గోప్యతను పణంగా పెట్టడం సరికాదని అన్నారు.

- Advertisement -

రాజకీయాల కోసం అమ్మాయి జీవితంతో ఆటలా?: సోషల్ మీడియాలో సదరు యువతి ఫోటోలను బహిర్గతం చేయడంపై కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే బీఆర్ఎస్ శ్రేణులు అతి ఉత్సాహం ప్రదర్శించి.. ఆ అమ్మాయి ఫోటోలను విడుదల చేశాయని ఆరోపించారు. దీనివల్ల బాధితురాలి జీవితం నాశనమయ్యే ప్రమాదం ఉందని అన్నారు. దీనికి బీఆర్ఎస్ పార్టీనే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరించడం శోచనీయమని పేర్కొన్నారు.

Also read-IBOMMA: చిత్ర పరిశ్రమకు బిగ్‌ షాక్‌.. ఐ బొమ్మ మళ్లీ వచ్చింది!

లుకౌట్ నోటీస్‌ జారీకి డిమాండ్‌: ఈ కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్ దేశం విడిచి వెళ్లే అవకాశం ఉందని కవిత అన్నారు. తక్షణమే అతడిపై లుకౌట్ నోటీసులు జారీ చేయాలని పోలీసులను కోరారు. లుకౌట్ నోటీసులు జారీ చేయడం వల్ల విచారణ పారదర్శకంగా జరుగుతుందన్న నమ్మకం మహిళల్లో కలుగుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకున్నప్పుడే వ్యవస్థపై ప్రజలకు గౌరవం పెరుగుతుందని వ్యాఖ్యానించారు. బాధితురాలికి న్యాయం జరిగే వరకు పోలీసులు పట్టుదలతో వ్యవహరించాలని కోరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News