HomeTop StoriesAviation : గగనంలో ఘోర కుట్ర.. ఫ్లైదుబాయ్ ఘటనపై ట్రంప్ హెచ్చరిక

Aviation : గగనంలో ఘోర కుట్ర.. ఫ్లైదుబాయ్ ఘటనపై ట్రంప్ హెచ్చరిక

FlyDubai Flight Mid-Air Attack : ఆకాశంలో వేలాది అడుగుల ఎత్తున ప్రయాణిస్తున్న వేళ.. ఊహించని రీతిలో కాక్‌పిట్‌లో నెత్తుటి ఘర్షణ. వందలాది మంది అమాయకుల ప్రాణాలను గాల్లోనే కలిపేసేందుకు విమానాన్ని కూల్చివేసే పెను కుట్ర. ఇజ్రాయెల్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో జరిగిన ఈ వికృత చేష్టల వెనుక అసలు సూత్రధారులు ఎవరు? గగనతలంలో సాగిన ఈ విధ్వంసక యత్నం పశ్చిమాసియాలో మరో యుద్ధ జ్వాలలకు ఆజ్యం పోయనుందా?

- Advertisement -

ఘటన క్రమం – ఇరాన్‌పై అనుమానాలు: దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో ఒమన్‌కు చెందిన కో-పైలట్.. భారత సంతతికి చెందిన కెప్టెన్ స్మిత్ మచ్చార్‌పై విచక్షణారహితంగా దాడి చేశాడు. విమానాన్ని వేగంగా కిందికి దించి కూల్చేందుకు యత్నించగా, అప్రమత్తమైన ప్రయాణికులు, ఇతర సిబ్బంది అతడిని బంధించి సౌదీ అరేబియాలో అత్యవసరంగా ల్యాండ్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది.

ఈ ఉదంతంపై అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిప్పులు చెరిగారు. విమానాన్ని కూల్చేందుకు ప్రయత్నించిన నిందితుడి వెనుక టెహ్రాన్ హస్తమున్నట్లు తేలితే ఇరాన్ తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని తేల్చిచెప్పారు.

తీవ్ర పరిణామాలు తప్పవు: “ప్రస్తుతానికి అందుతున్న సమాచారం ప్రకారం నిందితుడికి ఇరాన్‌తో సంబంధాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే దర్యాప్తు ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. ఒకవేళ ఇరాన్ ప్రమేయం నిజమని తేలితే.. మా ప్రతిస్పందన చాలా తీవ్రంగా ఉంటుంది. అమెరికా ఇచ్చే దెబ్బ ఎలా ఉంటుందో వారికి ఇప్పటికే తెలుసు” అని ట్రంప్ హెచ్చరించారు. నిందితుడికి రాడికల్ భావజాలం ఉన్నట్లు ఇజ్రాయెల్ కూడా పేర్కొనడంతో, అంతర్జాతీయ దర్యాప్తు సంస్థలు ఈ కుట్ర మూలాలను కూపీ లాగుతున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News