Anchor Shiva Jyothi: తిరుపతి లడ్డుపై ప్రముఖ యాంకర్ శివ జ్యోతి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై టీటీడీ (TTD) కఠిన నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. శివ జ్యోతి ఆధార్ కార్డు(Aadhaar card)ను బ్లాక్ చేస్తూ.. భవిష్యత్తులో శ్రీవారి దర్శనం చేసుకోకుండా నిషేధం విధించినట్టు షోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.
టీటీడీ విజిలెన్స్ విభాగం దర్యాప్తు: ఇటీవల శ్రీవారి ప్రసాదంపై శివ జ్యోతితో పాటు ఆమె తమ్ముడు చేసిన వ్యాఖ్యలు భారీ వివాదానికి దారితీశాయి. తిరుమల ప్రసాదం లడ్డూ నాణ్యత, ధర, నిర్వహణపై వ్యతిరేక వ్యాఖ్యలతో భక్తుల మనోభావాలు దెబ్బతినాయని టీటీడీ అభిప్రాయపడింది. దీనితో టీటీడీ విజిలెన్స్ విభాగం వెంటనే దర్యాప్తు ప్రారంభించి.. కుటుంబాన్ని నేరుగా పరిశీలించింది. అనంతరం, టీటీడీ ట్రస్ట్ బోర్డు అత్యవసరంగా సమావేశమై శివ జ్యోతి ఆధార్‌ను బ్లాక్ చేయాలని నిర్ణయించిందని తెలుస్తోంది. టీటీడీ కఠిన నిర్ణయంతో శివ జ్యోతి ఇకనుంచి ఈ-దర్శనం, సర్వదర్శనం, ప్రత్యేక దర్శనం వంటి ఏ రకమైన దర్శనాలకు కూడా అనుమతి పొందలేని పరిస్థితి ఏర్పడిందని షోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.
నిషేధం వార్తల్లో నిజం: అయితే టీటీడీ ఎప్పుడూ ఇలాంటి నిర్ణయాలు తీసుకోదని తెలుస్తోంది. నిజానికి శివ జ్యోతి ఈ వివాదంలో ఇప్పటికే క్షమాపణలు సైతం చెప్పింది. తన మాటలు తప్పుగా ఉన్నాయి తప్పితే.. తన ఇంటెన్షన్ మాత్రం అది కాదని వివరణ ఇస్తూ వీడియో సైతం రిలీజ్ చేసింది. తనకు వెంకటేశ్వర స్వామి అంటే ఎంతో ఇష్టమని పేర్కొంది. గత మూడు నాలుగు నెలలుగా శనివారాల్లో చేసే వ్రతాల గురించి వీడియోలు సైతం చేశానని పేర్కొంది. తన ఇంట్లో వెంకటేశ్వర స్వామి ఉంటాడని.. తన చేతి మీద వెంకటేశ్వర స్వామి ఉంటాడని తెలిపింది. తన జీవితంలో అత్యంత విలువైన సంతానాన్ని వెంకటేశ్వర స్వామి ప్రసాదించాడని శివ జ్యోతి పేర్కొంది
Also Read:https://teluguprabha.net/top-stories/anchor-shivajyothi-inappropriate-comments-on-tirumala-laddu/
అసలేం జరిగిందంటే: ఆలయ పవిత్రతను మంటగలిపే విధంగా యాంకర్ శివ జ్యోతి, ఆమె తమ్ముడు వ్యవహరించారు. ఇటీవల కుటుంబ సభ్యులతో కలిసి యాంకర్ శివజ్యోతి శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వెళ్లింది. ఈ క్రమంలోనే వారు కలియుగ దైవమైన శ్రీవారి దర్శనం కోసం క్యూ లైన్‌లో నిల్చోని ఉన్నారు. ఆ సమయంలో టీటీడీ సిబ్బంది భక్తుల కోసం ప్రసాదాన్ని పంపిణీ చేశారు. అయితే ఆ ప్రసాదం తీసుకున్న శివజ్యోతి, ఆమె తమ్ముడు లడ్డుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ క్యూలైన్‌లోనే ఓ రీల్ తీశారు. ఆ వీడియోలో యాంకర్ శివజ్యోతి “తిరుమలలో కాస్ట్‌లీ ప్రసాదం అడుక్కుంటున్నాం.. రిచ్చెస్ట్ బిచ్చగాళ్లం మేమే” అంటూ వివాదాస్పద కామెంట్లు చేసింది. అంతే కాకుండా ఆ రీల్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ఆ రీల్ విపరీతంగా వైరల్ అయ్యింది. అది చూసిన నెటిజన్లు, హిందూ ధార్మిక సంఘాలు శివజ్యోతితో పాటు ఆమె స్నేహితులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీటీడీ వెంటనే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. భక్తుల కోరిక మేరకు టీటీడీ విజిలెన్స్ విభాగం దర్యాప్తు చేసింది. అనంతరం శివ జ్యోతి భవిష్యత్తులో శ్రీవారి దర్శనం చేసుకోకుండా.. ఆమె ఆధార్ కార్డును టీటీడీ బ్లాక్ చేసినట్లుగా తెలుస్తోంది.

