HomeTop StoriesTamil Nadu: గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరిన విజయ్‌.. మ్యాజిక్‌ ఫిగర్‌కు 10 సీట్ల దూరంలో టీవీకే!

Tamil Nadu: గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరిన విజయ్‌.. మ్యాజిక్‌ ఫిగర్‌కు 10 సీట్ల దూరంలో టీవీకే!

TVK chief Vijay: తమిళనాడు రాజకీయాలు ఆసక్తికర మలుపు తిరిగాయి. అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య విజయంతో అతిపెద్ద పార్టీగా అవతరించిన తమిళగ వెట్రి కళగం (TVK) ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటుపై దృష్టి సారించింది. ఈ క్రమంలో టీవీకే అధినేత విజయ్.. రాష్ట్ర గవర్నర్‌ అపాయింట్‌మెంట్‌ కోరడం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది.

- Advertisement -

మ్యాజిక్ ఫిగర్‌కు చేరువలో: తమిళనాడులోని మొత్తం 234 స్థానాలకు గాను విజయ్ నేతృత్వంలోని టీవీకే 108 స్థానాలను కైవసం చేసుకుంది. దీంతో మ్యాజిక్‌ ఫిగర్‌కు 10 సీట్ల దూరంలో విజయ్‌ పార్టీ నిలిచింది. అయితే ఈ రోజు ఉదయం 10 గంటలకు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో కలిసి విజయ్ గవర్నర్‌ను కలవనున్నట్లు సమాచారం.

Also read-TVK Vijay: కోటి 28 లక్షల ఓట్లతో ‘టీవీకే’ సూపర్‌ హిట్‌.. రెండు స్థానాల్లోనూ ‘విజయ్‌’ సంచలన విజయం

గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం: ప్రస్తుతం టీవీకే మ్యాజిక్ ఫిగర్‌కు కేవలం 10 సీట్ల దూరంలోనే ఉండటంతో ఏ పార్టీ మద్దతుతో విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనేది ఉత్కంఠ రేపుతోంది. స్వతంత్ర అభ్యర్థులు లేదా చిన్న పార్టీల మద్దతు కూడగట్టే పనిలో టీవీకే వర్గాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి విజయ్ మద్దతు నిరూపించుకుంటే.. తమిళ రాజకీయ చరిత్రలో మరో నటుడు సీఎం పీఠాన్ని అధిరోహించినట్లవుతుంది. ఇప్పటికే ఎంజీ రామచంద్రన్‌, జయలలిత వెండితెరపై ఓ వెలుగు వెలిగి… తమిళనాడు రాజకీయాల్లో తమదైన చరిత్రను లిఖించుకున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News