HomeTop StoriesTamil Nadu: నేడు విజయ్ సర్కార్‌కు అసెంబ్లీలో బలపరీక్ష.. నల్లేరు మీద నడకే!

Tamil Nadu: నేడు విజయ్ సర్కార్‌కు అసెంబ్లీలో బలపరీక్ష.. నల్లేరు మీద నడకే!

Floor test: తమిళనాడు అసెంబ్లీలో నేడు కీలక ఘట్టం చోటుచేసుకోనుంది. నూతన ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్‌ తన ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి అసెంబ్లీలో నేడు బలపరీక్ష ఎదురుకోనున్నారు. మే 10న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్.. నేడు నిర్వహించబోయే ఫ్లోర్ టెస్ట్‌లో నెగ్గడం ద్వారా తన పట్టును చాటుకోనున్నారు.

- Advertisement -

నల్లేరు మీద నడకే: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే 108 స్థానాల్లో విజయం సాధించింది. విజయ్ రెండు స్థానాల నుండి పోటీ చేసి గెలవడంతో అందులో ఒక స్థానానికి రాజీనామా చేశారు. దీంతో టీవీకే ఎమ్మెల్యేల సంఖ్య 107కు చేరింది. అయితే శ్రీనివాస్ అనే ఎమ్మెల్యే ఎన్నికపై కోర్టు వివాదం కారణంగా ఆయన ఓటింగ్‌కు దూరంగా ఉండాలని హైకోర్టు ఆదేశించడంతో పార్టీ బలం 106కు పడిపోయింది. అయినప్పటికీ కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు, వీసీకే వంటి మిత్రపక్షాల మద్దతుతో విజయ్ బలం ఇప్పటికే 120కి చేరింది. తాజాగా అన్నాడీఎంకేకు చెందిన సుమారు 30 మంది రెబల్ ఎమ్మెల్యేలు సైతం విజయ్‌కు మద్దతు ప్రకటించారు. దీంతో నేడు విజయ్‌ అసెంబ్లీలో బలపరీక్ష నెగ్గడం.. నల్లేరు మీద నడకే అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Also read-Import Duty: బంగారంపై కేంద్రం షాక్.. దిగుమతి సుంకాన్ని రెట్టింపు చేసిన మోదీ సర్కార్

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News