HomeTop StoriesTamil Nadu: దళపతి ఎన్నికల శంఖారావం.. రెండు చోట్ల నుంచి విజయ్ పోటీ!

Tamil Nadu: దళపతి ఎన్నికల శంఖారావం.. రెండు చోట్ల నుంచి విజయ్ పోటీ!

TVK Party: తమిళ స్టార్ హీరో, టీవీకే అధ్యక్షుడు విజయ్ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల యుద్ధానికి సర్వం సిద్ధం చేశారు. ఆదివారం చెన్నైలో నిర్వహించిన కార్యక్రమంలో తమిళగ వెట్రి కళగం(TVK) పార్టీ తరపున పోటీ చేయబోయే 234 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. ఏప్రిల్ 23న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతున్నట్లు ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

- Advertisement -

రెండు చోట్ల నుంచి విజయ్ పోటీ: విజయ్ ఈ ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నట్లుగా ప్రకటించారు. చెన్నైలోని పెరంబూర్‌తో పాటుగా తిరుచిరాపల్లిలోని తిరుచ్చి ఈస్ట్ స్థానాల నుంచి పోటీ చేస్తున్నట్లుగా తెలిపారు. అయితే నామినేషన్ పత్రాల్లో తన పూర్తి పేరును సి. జోసెఫ్ విజయ్‌గా పేర్కొంటానని ఆయన వెల్లడించారు.

కీలక నేతలకు ప్రాధాన్యత: పార్టీలోని ముఖ్య నేతలకు విజయ్ ప్రాధాన్యత కల్పించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్. ఆనంద్‌ను టి. నగర్ నియోజకవర్గం నుండి అభ్యర్థిగా ప్రకటించారు. ట్రెజరర్ వెంకట్ రమణన్‌ను మైలాపూర్‌, ఆధవ్ అర్జునను విల్లివాక్కం నుండి పోటికి దింపనున్నారు. సీనియర్ నేతలైన కె.ఎ. సెంగోట్టయన్, సి.టి.ఆర్. నిర్మల్ కుమార్‌లకు సైతం కీలక స్థానాలను కేటాయించారు.

Also read-PM E-DRIVE: గుడ్ న్యూస్.. పీఎం ఇ-డ్రైవ్ గడువు పొడిగింపు!

సామాన్యులే నా సైనికులు: అభ్యర్థుల ఎంపికపై విజయ్ భావోద్వేగంగా మాట్లాడారు. “మా అభ్యర్థులు సామాన్య నేపథ్యం నుంచి వచ్చిన వారు. వారికి పెద్ద ఎత్తున ఆస్తులు లేదా రాజకీయ పలుకుబడి లేకపోవచ్చు. కానీ సామాన్యుల కష్టాలు తెలిసిన ప్రజల రక్షకులు వారు” అని పేర్కొన్నారు. అనుభవం కంటే చిత్తశుద్ధి, అవినీతి రహిత పాలనే తన ప్రాధాన్యతని ఆయన స్పష్టం చేశారు. పార్టీ ఎన్నికల గుర్తు అయిన ‘విజిల్’ను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మహిళల భద్రత, డ్రగ్స్ రహిత తమిళనాడు తన ప్రధాన లక్ష్యాలని అన్నారు. తమిళ ప్రజల సంక్షేమం కోసం తమ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని విజయ్ విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News