Fridge Explosion: నిర్మల్ జిల్లా కేంద్రంలో ఘోర ప్రమాదం సంభవించింది. మహాలక్ష్మి వాడలోని ఒక డబుల్ బెడ్రూమ్ ఇంట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఫ్రిడ్జ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణం: మహాలక్ష్మి వాడకు చెందిన విజయ్‌తో పాటు మహిళ ఇంట్లో ఉన్న సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగింది. దీంతో ఫ్రిడ్జ్ పేలి మంటలు భారీగా వ్యాపించాయి. మంటల ధాటికి వారిద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి.గమనించిన స్థానికులు వెంటనే బాధితులను సమీప ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు వారు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. విద్యుత్ ఉపకరణాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. షార్ట్ సర్క్యూట్ వంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు తెలిపారు.

