HomeTop StoriesiPhone 16 Pro:ఉద్యోగులకు ఐఫోన్ 16 ప్రో గిఫ్ట్ ఇచ్చిన బాస్‌

iPhone 16 Pro:ఉద్యోగులకు ఐఫోన్ 16 ప్రో గిఫ్ట్ ఇచ్చిన బాస్‌

UAE Boss Gifts iPhone 16 Pro:సాధారణంగా ఉద్యోగులు ఎక్కువ కష్టపడ్డారనో,తమ కంపెనీకి ఎక్కువ లాభాలు తీసుకుని వచ్చారనో…లేకపోతే దసరా, దీపావళి వంటి పండగలకి బోనస్‌లు ఇస్తుండడం మనం చూస్తూనే ఉంటాం.వింటూనే ఉంటాం.సోషల్‌ మీడియా పుణ్యమా అంటూ దీపావళికి ఏ కంపెనీ ఎలాంటి బహుమతులు ఇచ్చిందో తెలుస్తుంది. కొందరు సూట్‌ కేసులు,కుక్కర్లు ఇస్తే..మరి కొందరు డబ్బులను గిఫ్ట్‌ ల కింద ఇస్తుంటారు.

- Advertisement -

కానీ ఇక్కడ మాత్రం ఓ కంపెనీ యజమాని తన ఉద్యోగులకు ఇచ్చిన ప్రత్యేక బహుమతి ఇప్పుడు సోషల్ మీడియాలో పిచ్చిపిచ్చిగా వైరల్‌ అవుతుంది. తన టీమ్‌లో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగికి ఐఫోన్ 16 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను గిఫ్ట్‌గా అందించారు. ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌ను అందుకోవడంతో ఉద్యోగులు ఆనందంలో మునిగిపోయారు.

కొత్త ఫోన్లను ఉద్యోగులు ఎంతో ఉత్సాహంగా అన్‌బాక్స్ చేస్తున్న దృశ్యాలను వీడియోగా చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ఉద్యోగుల ఆనందం, ఆశ్చర్యం స్పష్టంగా కనిపించింది. వీడియో బయటకు వచ్చిన కొద్దిసేపటికే భారీగా వ్యూస్ రావడంతో పాటు పెద్ద సంఖ్యలో కామెంట్లు కూడా వచ్చాయి.

కంపెనీ విజయానికి ఉద్యోగులు అందిస్తున్న కృషిని గుర్తించి, వారి శ్రమకు గౌరవంగా ఈ బహుమతిని ఇచ్చినట్లు యజమాని తెలిపారు. ఉద్యోగుల పనితీరును గుర్తించి వారికి ప్రత్యేకంగా కానుక ఇవ్వడం పట్ల పలువురు నెటిజన్లు స్పందించారు.

ఇలాంటి బాస్ ప్రతి సంస్థలో ఉంటే ఉద్యోగుల్లో ఉత్సాహం పెరుగుతుందని కొందరు కామెంట్ చేశారు. తమ కార్యాలయంలో కూడా ఇలాంటి సర్ప్రైజ్ వస్తే బాగుంటుందని మరికొందరు సరదాగా పేర్కొన్నారు.

Also Read:Telangana:తెలంగాణలో మారుతున్న వాతావరణం.. ఈ జిల్లాల్లో వానలు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News