UFC Fighter: క్రీడా ప్రపంచానికి ఇది ఓ బ్యాడ్ న్యూస్. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ రంగానికి షాకింగ్ న్యూస్. ప్రసిద్ధ యుఎఫ్‌సి ఫైటర్, బ్రెజిల్ స్టార్ అల్లాన్ నాసిమెంటో 34 ఏళ్ల వయసులోనే కన్నుమూశారు.నిద్రలోనే గుండెపోటుతో ఆయన చనిపోయినట్లు అధికారిక వర్గాలు తెలపడంతో క్రీడాభిమానులు, సహచర ఆటగాళ్లు విషాదంలో మునిగిపోయారు.
ప్రత్యర్థులను భయపెట్టే పోరాట యోధుడు…
ఎంతో ఫిట్ గా ఉండి రింగులో ప్రత్యర్థులను భయపెట్టే పోరాట యోధుడు ఇలా అకస్మాత్తుగా మరణించడం ఎవరూ తట్టుకోలేకపోతున్నారు. సోమవారం పడకగదిలో స్పృహతప్పి పడిపోయిన నాసిమెంటోనుగుర్తించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు.అయినప్పటికీ లాభం లేకపోయింది.
నిద్రలోనే గుండెపోటు రావడం వల్ల ఆయన ప్రాణాలు కోల్పోయారని వైద్యులు స్పష్టం చేశారు. ఈ విషాద వార్తను యుఎఫ్‌సి సంస్థ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. యుఎఫ్‌సి తీవ్ర విచారాన్ని వ్యక్తం చేసింది. ‘మా ప్రియమైన ఫైటర్, అద్భుతమైన ఫ్లైవెయిట్ క్రీడాకారుడు అల్లాన్ నాసిమెంటో ఈ ఉదయం నిద్రలోనే గుండెపోటుకు గురై కన్నుమూశారు. ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, సహచర ఆటగాళ్లకు మా తీవ్ర సానుభూతి తెలియజేస్తున్నాం’ అని యుఎఫ్‌సి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొంది.
Also Read: http://Virus: పిల్లలను కబళిస్తున్న చండీపుర వైరస్..ఇప్పటికే 22 మంది మృతి

