HomeTop StoriesTelangana: ప్రభుత్వ బడుల్లో యూకేజీ.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు!

Telangana: ప్రభుత్వ బడుల్లో యూకేజీ.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు!

UKG in govt schools: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు రేవంత్‌ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరం (2026-27) నుండి రాష్ట్రవ్యాప్తంగా అదనంగా 3,000 ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ విద్యను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఇప్పటికే 1,362 పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక తరగతులు విజయవంతంగా నడుస్తున్నాయి. తాజాగా మరిన్ని పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ విద్యను అమలు చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది.

- Advertisement -

తక్షణమే జాబితా పంపాలని ఆదేశాలు: రాష్ట్రంలోని 12,700 గ్రామ పంచాయతీల్లో కనీసం ఒక పాఠశాలలో ప్రీ-ప్రైమరీ తరగతులు ఉండాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఏ పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ అవసరమో అధ్యయనం చేసి.. తక్షణమే జాబితా పంపాలని ప్రభుత్వం జిల్లా విద్యాశాఖ అధికారులను (DEO) ఆదేశించింది. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 6,000 మందికి తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.

Also read-CM Revanth Reddy: ‘క్రీడల్లో రాణించాల్సిన యువత మత్తు బారిన పడటం బాధాకరం’

ప్రైవేటుకు దీటుగా క్యూర్‌ పరిధిలోనూ అమలు: హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (CURE) పరిధిలో కూడా ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. ఔటర్ రింగ్ రోడ్ (ORR) లోపల ఉన్న 28 ప్రాంతాల్లో ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు నాణ్యమైన విద్యను ఒకే చోట అందించేలా ప్రభుత్వం ఇప్పటికే జీఓ జారీ చేసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News