Domalguda: హైదరాబాద్‌లోని దోమల్‌గూడ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన వెలుగుచూసింది. కావడిగూడ ప్రాంతంలోని గోశాల సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి చెత్తకుప్పలో సజీవంగా దహనమవుతున్నట్లు స్థానికులు ఉదయం గుర్తించారు. అపస్మారక స్థితిలో వ్యక్తి కాలుతుండటంతో వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
ఘటనా స్థలానికి రెస్క్యూ టీమ్: సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అప్పటికే ఆ వ్యక్తి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడు ఎవరనే కోణంతో పాటు, ఇది ఆత్మహత్యా లేక హత్యనా అనే కోణంలో పోలీసులు తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలంలో ఎలాంటి గుర్తింపు కార్డులు లభించకపోవడంతో మృతుడి ఆచూకీ లభించలేదు. మృతదేహాన్ని గుర్తించేందుకు స్థానికుల సహాయం కోరుతున్న పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ (CCTV) ఫుటేజీలను పరిశీలిస్తూ దర్యాప్తు ముమ్మరం చేశారు. జనసంచారం ఉండే ప్రాంతంలో ఇలాంటి ఘటన జరగడంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురవుతున్నారు.
Also Read-Viral: మంటగలిసిన మానవ సంబంధం.. వీడియో కాల్ ద్వారా తండ్రి అంత్యక్రియలు!

