Union Minister: సీఎం రేవంత్, కేసీఆర్‌పై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు లోపాయికారీ ఒప్పందంతో ముందుకు సాగుతున్నాయని అన్నారు.
అవన్నీ సీఎం అల్లుతున్న కట్టుకథలు: బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటేనంటూ కాంగ్రెస్ చేస్తున్న ప్రచారాన్ని బండి సంజయ్ కొట్టిపారేశారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిశాయని చెప్తే ఎవరూ నమ్మరని అన్నారు. అవన్నీ రేవంత్ రెడ్డి అల్లుతున్న కట్టుకథల తెలిపారు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి ఏదైనా మాట్లాడే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని హితవు పలికారు. గత పదేళ్లుగా బీఆర్ఎస్ అవినీతిపై కాంగ్రెస్ కంటే ఎక్కువగా పోరాడింది బీజేపీయేనని బండి సంజయ్ గుర్తు చేశారు.
కేసీఆర్ కుటుంబంపై చర్యలేవి?: కీలకమైన కేసుల్లో కేసీఆర్ కుటుంబంపై రేవంత్ సర్కార్ ఎందుకు మెతక వైఖరి అవలంబిస్తోందని బండి సంజయ్ ప్రశ్నించారు. కాళేశ్వరం కుంగిపోవడానికి పూర్తి బాధ్యత బీఆర్ఎస్‌దే అని చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. గతంలో ఐపీఎస్ అధికారి అకున్ సబర్వాల్ ఇచ్చిన డ్రగ్స్ నివేదిక ఏమైందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ ఎక్కడి వరకు వచ్చిందో ప్రజలకు తెలపాలని కోరారు.
Also read-Musi revitalization: మూసీ పునరుజ్జీవంపై కీలక నిర్ణయం.. కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు!
సీఎం రేవంత్, కేసీఆర్ కుమ్మక్కయ్యారు: “రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ ఒక్కటా.. లేక బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటా అనేది ప్రజలే తేలుస్తారు” అని సంజయ్ వ్యాఖ్యానించారు. కీలక కేసుల్లో విచారణ నత్తనడకన సాగుతుండటం చూస్తుంటే.. ఇరు పార్టీల మధ్య ఉన్న అవగాహన స్పష్టమవుతోందని ఆయన ఆరోపించారు.

