Saturday, March 14, 2026
HomeTop StoriesBandi Sanjay: ఇది రాజకీయ పర్యటననా?.. లేక వసూళ్ల సమీక్షనా?: రాహుల్‌ పర్యటనపై బండి సంజ‌య్...

Bandi Sanjay: ఇది రాజకీయ పర్యటననా?.. లేక వసూళ్ల సమీక్షనా?: రాహుల్‌ పర్యటనపై బండి సంజ‌య్ వ్యాఖ్యలు

Union Minister: కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ నిప్పులు చెరిగారు. తెలంగాణను దోచుకునేందుకే రాహుల్ గాంధీ ఇక్కడికి వచ్చారా? అని సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

- Advertisement -

వసూళ్ల కోసమేనా?: తెలంగాణను దోచుకునేందుకే రాహుల్ గాంధీ ఇక్కడికి వచ్చారా? అని సంజయ్ ప్రశ్నించారు. ఇది రాజకీయ పర్యటననా లేక రాష్ట్రం నుంచి జరుగుతున్న వసూళ్లపై సమీక్షనా? అంటూ ఎద్దేవా చేశారు. అంతేకాకుండా వికారాబాద్‌లో జరుగుతున్న డీసీసీ అధ్యక్షుల శిక్షణ శిబిరాన్ని యాక్టింగ్ కోర్స్‌గా బండి సంజయ్‌ అభివర్ణించారు. యాక్టింగ్ కోర్స్‌ ముగింపు కార్యక్రమానికే రాహుల్ హాజరయ్యారని కేంద్ర మంత్రి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Also read-Kalvakuntla kavitha: “రాహుల్ జీ.. 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది?”

ప్రజలు గమనిస్తున్నారు: గాంధీ కుటుంబానికి రూ. 10,000 కోట్లు ఇవ్వగలమని.. అందులో తెలంగాణ నుంచే రూ. 1,000 కోట్లు అందించగలమని అదే వేదికపై సీఎం రేవంత్ రెడ్డి చెప్పారంటూ బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ వనరులను దిల్లీకి తరలిస్తోందని ఆరోపించారు, ఈ పరిణామాలన్నింటినీ రాష్ట్ర ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అధికార పార్టీ తీరును తూర్పారబడుతూ, రాహుల్ పర్యటన కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమేనని బండి సంజయ్ విమర్శించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News