Kerala CM VD Satheesan: కేరళలో రాజకీయ ముఖచిత్రం మారింది. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత వీడీ సతీశన్ ప్రమాణ స్వీకారం చేశారు. కేరళ రాజధాని తిరువనంతపురంలో ఘనంగా జరిగిన ఈ కార్యక్రమానికి దేశంలోని ప్రముఖ రాజకీయ నేతలు హాజరయ్యారు.
అట్టహాసంగా ప్రమాణ స్వీకారోత్సవం: ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వీరితో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్‌రెడ్డి (తెలంగాణ), సిద్ధరామయ్య (కర్ణాటక), సుఖ్విందర్ సింగ్ సుఖు (హిమాచల్ ప్రదేశ్) హాజరై నూతన సీఎంకు శుభాకాంక్షలు తెలిపారు.
Also read-Rajinikanth: పార్టీ పెడితే ఖచ్చితంగా గెలిచేవాన్ని.. విజయ్ నాకు సమవుజ్జీ కాదు.. రజినీకాంత్ సంచలన వ్యాఖ్యలు
సుదీర్ఘ పాలనకు చెక్: ఇటీవల జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF) కూటమి ఘన విజయం సాధించింది. కేరళా అసెంబ్లీలోని 140 స్థానాలకు గాను యూడీఎఫ్ 102 గెలిచింది. దీంతో సుదీర్ఘకాలం తర్వాత కేరళలో ఎల్డీఎఫ్ (LDF) పాలనకు చెక్ పడింది. కాంగ్రెస్ కూటమి భారీ మెజార్టీతో అధికారంలోకి రావడంతో వీడీ సతీశన్ సారథ్యంలో సరికొత్త పాలన ప్రారంభం కానుంది. ఈ విజయంతో కేరళ కాంగ్రెస్ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం నెలకొంది.

