HomeTop StoriesBharathiraja: చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం.. ప్రముఖ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Bharathiraja: చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం.. ప్రముఖ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Bharathiraja: ప్రముఖ తమిళ దర్శకుడు భారతీరాజా (84) కన్నుమూశారు. గత కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న బుధ‌వారం తెల్ల‌వారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.

- Advertisement -

రూరల్ సినిమాలకు ట్రెండ్ సెట్టర్: 1941లో జన్మించిన భారతీరాజా.. 1977లో కమల్ హాసన్, రజనీకాంత్, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన “16 వయథినిలే” (తెలుగులో పదహారేళ్ల వయసు) చిత్రంతో దర్శకుడిగా ప్రస్థానాన్ని ప్రారంభించారు. తొలి చిత్రంతోనే అప్పట్లో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాశారు. గ్రామీణ నేపథ్యం, అక్కడి మనుషుల భావోద్వేగాలను వెండితెరపై అత్యంత సహజంగా ఆవిష్కరించడంలో ఆయన సిద్ధహస్తుడు.

తెలుగు ప్రేక్షకులకు ఆప్తుడు: భారతీరాజా కేవలం తమిళ చిత్రాలకే పరిమితం కాలేదు. తెలుగులో ఆయన అందించిన క్లాసిక్ చిత్రాలు ఎప్పటికీ నిలిచిపోతాయి. “సీతాకోక చిలుక, ఆరాధన, జమదగ్ని, ఈతరం ఇల్లాలు” తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. భారతీరాజా దర్శకుడిగానే కాకుండా నటుడిగానూ అలరించారు. “యువ, సీత కత్తి’ ఈశ్వరన్‌’ సర్‌’ తిరు’ మహారాజా” వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. భారతీరాజా మృతి పట్ల టాలీవుడ్, కోలీవుడ్ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు, నటీనటులు, దర్శకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. భారతీయ సినిమా ఒక గొప్ప దిగ్గజాన్ని కోల్పోయిందని వారు కొనియాడారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News