HomeTop StoriesCM Vijay: తమిళనాడు సీఎంగా విజయ్.. మరికొద్ది గంటల్లో ప్రమాణ స్వీకారం

CM Vijay: తమిళనాడు సీఎంగా విజయ్.. మరికొద్ది గంటల్లో ప్రమాణ స్వీకారం

Tamil Nadu CM Vijay: తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. ఇవాళ ఉదయం 10 గంటలకు చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఈ వేడుక అత్యంత వైభవంగా జరగనుంది. విజయ్‌తో పాటు ఆయన మంత్రివర్గంలోని కొందరు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ చారిత్రక ఘట్టానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరుకానున్నట్లు కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి.

- Advertisement -

గవర్నర్‌ను కలిసిన విజయ్: శనివారం సాయంత్రం విజయ్ గవర్నర్ ఆర్లేకర్‌ను కలిసి.. తనకు మద్దతు ఇస్తున్న మిత్రపక్షాల సమ్మతి లేఖలను అందజేశారు. సుమారు గంటన్నర పాటు జరిగిన చర్చల అనంతరం రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 ప్రకారం విజయ్‌ను ముఖ్యమంత్రిగా నియమిస్తున్నట్లు గవర్నర్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ నెల 13వ తేదీలోగా అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవాలని విజయ్ ప్రభుత్వానికి గవర్నర్ సూచించారు.

మ్యాజిక్ ఫిగర్ దాటిన బలం: అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే (TVK), ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 స్థానాల మెజారిటీ కోసం చిన్న పార్టీల మద్దతును కూడగట్టింది. ప్రస్తుతం విజయ్ పక్షాన ఉన్న బలం ఇలా ఉంది

  • టీవీకే (TVK) -107 (విజయ్ రెండు సీట్లలో గెలిచినందున ఒకటి తగ్గింది)
  • కాంగ్రెస్ -05
  • వీసీకే (VCK) -02
  • సీపీఐ / సీపీఎం -04 (తలా 2)
  • ఐయూఎంఎల్ -02
  • మొత్తం బలం -120

రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా విజయ్‌కు మద్దతు: కాంగ్రెస్ మినహా మిగిలిన మిత్రపక్షాలన్నీ విజయ్ ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించాయి. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితిని తొలగించి, రాష్ట్రపతి పాలన రాకుండా చేసేందుకే తాము మద్దతు ఇస్తున్నట్లు వీసీకే అధినేత తిరుమావళవన్ స్పష్టం చేశారు. మద్దతు ఇస్తున్న పార్టీలు డీఎంకే కూటమిలోనే కొనసాగుతూనే రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా విజయ్‌కు అండగా నిలవడం గమనార్హం.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News