Tamil Nadu CM Vijay: తమిళనాడు నూతన శకం మొదలైంది. ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో పాటు మరో తొమ్మిది మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.సీఎం విజయ్‌తో పాటు మంత్రులతో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ప్రమాణస్వీకారం చేయించారు. ఈ నూతన మంత్రివర్గంలో టీవీకే ఎమ్మెల్యేలతో పాటు మిత్రపక్షమైన కాంగ్రెస్‌కు కూడా ప్రాతినిధ్యం కల్పించారు.
కేబినెట్‌లో 9మందికి చోటు: మొత్తం 9 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆనంద్, ఆదవ అర్జున, సెంగోటియన్, కీర్తన, అరుణ్ రాజ్, వెంకటరమణన్, నిర్మల్ కుమార్ తదితరులు విజయ్ కేబినెట్‌లో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నూతన మంత్రివర్గంలో మహిళ సభ్యురాలైన కీర్తనకు అవకాశం కల్పించడం విశేషం.
సందడిగా నెహ్రూ స్టేడియం: ఈ వేడుకను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. ప్రముఖ సినీ నటి త్రిష నెహ్రూ స్టేడియంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పలువురు సినీ ప్రముఖులు సైతం హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితుడిగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరయ్యారు.విజయ్ రాజకీయ రంగప్రవేశం చేసిన తక్కువ కాలంలోనే అధికార పీఠాన్ని దక్కించుకోవడంతో తమిళ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది.

