HomeTop StoriesVinayaka Idol: వినాకయ విగ్రహాన్ని కొనుగోలు చేసే ముందు ఈ నియమాలు పాటిస్తున్నారా

Vinayaka Idol: వినాకయ విగ్రహాన్ని కొనుగోలు చేసే ముందు ఈ నియమాలు పాటిస్తున్నారా

Ganesh Chaturthi: మరో రెండు రోజుల్లో బుజ్జి గణపయ్య మన గుమ్మాల్లో కొలువుదీరడానికి వచ్చేస్తున్నాడు. అయితే గణేషుణ్ణి ఇంటికి ఆహ్వానించేటప్పుడు సరైన విగ్రహాన్ని ఎన్నుకోవడం చాలా ముఖ్యం.బయట మార్కెట్లో వినాయక విగ్రహాలు ఎన్నో రంగుల్లో ,ఎన్నో రూపాలతో , వివిధ భంగిమలతో లభిస్తున్నప్పటికీ మన ఇంటికి ఎలాంటి విగ్రహాన్ని తీసుకురావాలనే విషయాల గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం.

- Advertisement -

విగ్రహంలో తొండం దిశ అనేది చాలా ముఖ్యమైన విషయామని పండితులు వివరిస్తున్నారు. అది పూజ ఫలితాలకు ,ఇంట్లోని శక్తులకు నేరుగా ముడిపడి ఉంటుంది. కుటుంబ జీవితంలో శాంతి, సంతోషాలను కాపాడుకోవడానికి సరైన రూపాన్ని గుర్తించడం చాలా అవసరం, తద్వారా మీరు పూజ సమయంలో తెలిసి తెలియకుండా ఎలాంటి పెద్ద పొరపాట్లు చేయకుండా ఉంటారని పండితులు వివరిస్తున్నారు.

ఎడమ వైపు తిరిగి ఉన్న తొండం

తొండం ఎడమ వైపుకు తిరిగి ఉన్న విగ్రహం ఇంటికి ఎంతో మంచిదని పండితులు వివరిస్తున్నారు. ఇది చంద్ర నాడితో సంబంధం కలిగి ఉంటుంది.దీని వల్ల ఇంట్లో అంతా మంచే జరుగుతుందని నమ్మకం.వామముఖి గణపతిని పూజించే నియమాలు చాలా తెలికైనవి.

కుడివైపుకు తిరిగిన తొండం గల గణేశుడిని సిద్ధివినాయకుడు అని అంటారు. సూర్య నాడితో సంబంధం కలిగి ఉంటుంది.

కఠినమైన నియమాలు, క్రమశిక్షణ కావాలి.అందుకే వాటిని సాధారణంగా దేవాలయాలలో ప్రతిష్ఠిస్తారు.పొరపాటున కూడా వినాయక చవితికి దీనిని ఇంటికి తీసుకుని రావొద్దు.

మీ ఇంటి కోసం విగ్రహాన్ని కొనుగోలు చేసేటప్పుడు, తొండం దిశతో పాటు, మరికొన్ని సాధారణ విషయాలను కూడా లెక్కలోకి తీసుకోవాలి. ముఖ్యం. గణేశ విగ్రహాన్ని ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తున్నట్లుగా కూర్చున్న భంగిమలో ఉన్న విగ్రహాన్నే ఇంటికి తీసుకురావాలి. కూర్చున్న భంగిమలోని విగ్రహం కుటుంబంలో స్థిరత్వాన్ని సానుకూలతను కాపాడుకోవడానికి సహాయపడుతుంది, అయితే నిలబడిన భంగిమలోని విగ్రహం దుకాణాలు లేదా కార్యాలయాలకు అనుకూలం.

విగ్రహంలో వినాయకుడి చేతిలో లడ్డు ఉండేలా, వాహనమైన ఎలుక ఆయన పాదాల దగ్గర ఉండేలా చూడాలి. ఎలుక లేని విగ్రహం అసంపూర్ణంగా పరిగణిస్తారు. విగ్రహాన్ని కొనుగోలు చేసేటప్పుడు, అది పగిలిపోకుండా లేదా విరిగిపోకుండా ఉన్న విగ్రహాలను తెచ్చుకోవాలి.పర్యావరణ హితం కోసం మట్టి విగ్రహాలనే ఎంచుకోవాలి.

Also Read:Rapes Are Extremely Alarming: అత్యాచారాలు అత్యంత ఆందోళనకరం

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News