HomeTop StoriesVisakhapatnam: విశాఖలో నోట్ల కలకలం

Visakhapatnam: విశాఖలో నోట్ల కలకలం

సెంట్రల్ పార్కు వద్ద కుప్పలుగా కరెన్సీ

- Advertisement -

విశాఖపట్నం, (తెలుగు ప్రభ): విశాఖలో బుధవారం తెల్లవారుజామున కరెన్సీ కలకలం రేపింది. ఆర్టీసీ కాంప్లెక్స్ దరి సెంట్రల్ పార్కు వద్ద ఒక చెట్టును ఆనుకుని నోట్లు కనిపింఛాయి. వాకర్స్ వాటిని చూసి సోషల్ మీడియాలో పెట్టారు. గుర్తు తెలియని మహిళ పాన్ కార్డు, అట్ట బాక్స్, ప్లాస్టిక్ కవర్లు, ఎల్ఐసీ రసీదులు కూడా కనిపించడంతో మీడియాకూ సమాచారమిచ్చారు.

రూ.500, రూ.100, రూ.50, రూ.20, 10రూపాయల నోట్లు దర్శనమివ్వడంతో జనం గుమిగూడారు. తీరా ఆ నోట్లన్నీ చిరిగిపోయి, చెద పట్టి ఉన్నాయి. ఎవరో సంచితో ఈ నోట్లు తెచ్చి పడేశారని, వాటిలో కొన్ని మంచివాటిని అక్కడి వారు తీసుకుపోయారని తెల్సింది. నోట్ల నంబర్లు కూడా కనిపించాయి. పనికిరాని నోట్లగా భావించి, ఇక్కడ పడేశారా, లేదంటే మరేదైనా కారణమై ఉండొచ్చని స్థానికులు భావిస్తున్నారు. అప్పటికే టూటౌన్ క్రైమ్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆరా తీశారు.

Also Read:Biggboss: ముఖేష్‌,వర్షిణిలను అల్లాడించిన దేబ్జానీ..బట్టలేకుండా ఎందుకు పూల్‌ లోకి దిగారు?

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News