WhatsApp: ప్రముఖ మెసేజింగ్ యాప్ ‘వాట్సప్’ వినియోగదారుల ప్రైవసీని మరింత పెంచేందుకు సరికొత్త ఫీచర్‌ను తీసుకువస్తోంది. ఇప్పటివరకు వాట్సప్‌లో ఎవరితోనైనా చాట్ చేయాలంటే మొబైల్ నంబర్ తప్పనిసరనే నిబంధన ఉండేది. కానీ ఇకపై అలాంటి అవసరం లేదు. భద్రతా ప్రమాణాలను పెంచుతూ.. మొబైల్ నంబర్ తెలియకపోయినా కేవలం ‘యూజర్ నేమ్’ (Username) ద్వారా అవతలి వారితో చాట్ చేసే వెసులుబాటును వాట్సప్ కల్పిస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి ఈ ఫీచర్ పూర్తిస్థాయిలో ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి రానుందని వాట్సప్ సీఈవో కునాల్ షా అధికారికంగా ప్రకటించారు.
ఇప్పుడే రిజర్వ్ చేసుకోండి: ఈ సరికొత్త ఫీచర్ కోసం వినియోగదారులు తమకు నచ్చిన, ప్రత్యేకమైన యూజర్‌నేమ్‌లను ఇప్పుడే రిజర్వ్ చేసుకోవాలని సీఈవో కునాల్ షా సూచించారు. “ముందుగా వచ్చిన వారికి ముందు” అనే ప్రాతిపదికన ఈ యూజర్‌నేమ్‌ల కేటాయింపు ఉంటుంది. కాబట్టి ఆలస్యం చేయకుండా వినియోగదారులు తమకు నచ్చిన పేర్లను లాక్ చేసుకోవాలని ఆయన కోరారు. అయితే ఇప్పటికే ఈ ఆప్షన్ ప్రపంచవ్యాప్తంగా కొందరు బీటా వినియోగదారులకు అందుబాటులోకి రావడం విశేషం.
Also read-WhatsApp: వాట్సప్ యూజర్లకు బిగ్ అలర్ట్.. అలా చేస్తే సైబర్ నేరగాళ్లకు చిక్కినట్లే!
యూజర్ నేమ్ ఎలా రిజర్వ్ చేసుకోవాలంటే?: మొదట మీ మొబైల్‌లోని వాట్సప్ యాప్‌ను లేటెస్ట్ వెర్షన్‌కి అప్‌డేట్ చేయండి. యాప్ ఓపెన్ చేసి సెట్టింగ్స్‌లోకి వెళ్లండి. అక్కడ అకౌంట్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. అందులో కనిపించే యూజర్‌నేమ్ (Username) విభాగంలోకి వెళ్లి.. మీకు నచ్చిన పేరును టైప్ చేసి లభ్యతను బట్టి రిజర్వ్ చేసుకోవచ్చు. కొత్త వ్యక్తులతో నంబర్ పంచుకోవడానికి ఇష్టపడని వారికి, ముఖ్యంగా మహిళల భద్రతకు ఈ ఫీచర్ ఎంతగానో ఉపయోగపడనుందని సాంకేతిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

