Saturday, November 15, 2025
HomeTop StoriesWomen’s World Cup: సెంచరీతో అదగొట్టిన జెమీమా.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఆమెనే..

Women’s World Cup: సెంచరీతో అదగొట్టిన జెమీమా.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఆమెనే..

Women’s World Cup: మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీస్‌లో ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించింది. కంగారూలపై టీమ్‌ఇండియా 5 వికెట్ల తేడాతో నెగ్గింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ 49.5 ఓవర్లలో 338 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఈ లక్ష్యాన్ని భారత్ 48.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. జెమీమా రోడ్రిగ్స్‌ (127*), హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (89) చెలరేగారు. దీంతో, నవంబర్‌ 2న ఫైనల్‌లో దక్షిణాఫ్రికాతో భారత్‌ తలపడనుంది.

- Advertisement -

Read Also: Women’s World Cup: 2017 హిస్టరీ రిపీట్.. ప్రపంచ కప్ ఫైనల్స్ కు భారత్

ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా..

అయితే, ఈ మ్యాచ్ లో హీరో ఎవరంటే జెమీమా రోడ్రిగ్స్ పేరే చెప్పుకోవాలి. ఆసీస్ పై అజేయ సెంచరీ చేసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచింది. కేవలం  134 బంతుల్లో 127 పరుగులు చేసింది. ఏకంగా 14 ఫోర్లు బాదింది. అయితే, ఇప్పటివరకు ఆమె కెరీర్ లో చేసిన బెస్ట్ స్కోర్ ఇదే కావడం గమనార్హం. మ్యాచ్ తర్వాత జెమీమా మాట్లాడుతూ.. “జీసెస్ అండ వల్లే ఇంత స్కోర్ చేయగలిగా.. మా అమ్మ, నాన్న, కోచ్, నన్ను నమ్మిని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ నాలుగు నెలలు ఎంత కష్టంగా గడిచాయో చెప్పలేం. కానీ, చివరికి కల నిజమయ్యింది” అని చెప్పుకొచ్చింది.

Read Also: Australian cricketer: ఘోర విషాదం.. మైదానంలోనే క్రికెటర్ మృతి

జెమీమా కెరీర్

జెమీమా 2018లో భారత మహిళల క్రికెట్ జట్టుకు అరంగేట్రం చేసింది. ఆమె ఇప్పటి వరకు 3 టెస్టులు, 57 వన్డేలు, 112 టీ20 మ్యాచ్‌లు ఆడింది. 3 టెస్టుల్లో 58.75 సగటుతో 235 పరుగులు చేసింది. ఈ సమయంలో ఆమె 3 అర్ధ సెంచరీలు సాధించింది. జెమీమా 57 వన్డేల్లో 8 అర్ధ సెంచరీలు, రెండు సెంచరీలతో 1598 పరుగులు చేసింది. ఆమె సగటు 32.61గా ఉంది. అత్యధిక టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడే అవకాశం జెమీమాకు దక్కింది. ఆమె 112 మ్యాచ్‌లలో 30.06 సగటు, 116.48 స్ట్రైక్ రేట్‌తో 2375 పరుగులు చేసింది. జెమీమా ఖాతాలో 13 అర్ధ సెంచరీలు ఉన్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad