HomeTop StoriesYadagiriGutta: మరుగుదొడ్ల ఏర్పాటుకు చర్యలు.. తెలుగుప్రభ కథనానికి స్పందన

YadagiriGutta: మరుగుదొడ్ల ఏర్పాటుకు చర్యలు.. తెలుగుప్రభ కథనానికి స్పందన

యాదాద్రి, (తెలుగుప్రభ): యాదగిరిగుట్ట గిరి ప్రదక్షణ భక్తులకు మరుగుదొడ్ల సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారని గత నెల 31న ‘తెలుగుప్రభ’ దినపత్రికలో ‘తిప్పలు తప్పవా స్వామి!’ అనే శీర్షికతో ప్రచురితమైన కథనానికి ఆలయ చైర్మన్ స్పందించారు. ఇప్పటివరకు మరుగుదొడ్ల అంశం తన దృష్టికి రాలేదని, తక్షణమే నిర్మాణానికి చర్యలు చేపడుతామని వైటీడీ చైర్మన్ మన్నే సత్యనారాయణరెడ్డి తెలిపారు. ఈమేరకు దేవస్థానం ప్రధాన కార్యాలయంలో బుధవారం శానిటేషన్ విభాగాల అధికారులతో భక్తులకు ఎక్కడ మరుగుదొడ్లు కావాలనే అంశాలపై ఆళయ ఈఓ జే. భవాని శంకర్ సమీక్ష నిర్వహించి, చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాగా, గిరి ప్రదక్షిణ భక్తులకు మరుగుదొడ్ల అంశాన్ని వెలుగులోకి తెచ్చిన ‘తెలుగుప్రభ’కు భక్తులు, స్థానికులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News