HomeTop StoriesYS Jagan: "మీరే నా స్ఫూర్తి.. మీ ఆశీస్సులే నా ధైర్యం.. మిస్ యూ నాన్నా"

YS Jagan: “మీరే నా స్ఫూర్తి.. మీ ఆశీస్సులే నా ధైర్యం.. మిస్ యూ నాన్నా”

YS Jagan: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత డాక్టర్‌ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులు అర్పించారు. మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తండ్రి సమాధి వద్ద పూలమాల ఉంచి అంజలి ఘటించారు. అనంతరం మత పెద్దలు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో జగన్‌ పాల్గొన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో పాటు వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -

మిస్ యూ నాన్నా: వైఎస్సార్‌ జయంతి సందర్భంగా సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌.. తన తండ్రిపై గల ప్రేమను సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. “మీరే నా స్ఫూర్తి.. మీ ఆశీస్సులే నా ధైర్యం.. మిస్ యూ నాన్నా” అంటూ భావోద్వేగమైన ట్వీట్‌ చేశారు. వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తున్న ఫోటోలను సైతం పోస్టు చేశారు. వైఎస్‌ జగన్‌ చేసిన ట్వీట్‌ ప్రస్తుతం సాషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News