Wednesday, January 14, 2026
HomeTop StoriesYS Jagan: "చంద్రబాబుది విలన్‌ క్యారెక్టర్‌.. నాడు మామకు.. ఇప్పుడు సీమకు!"

YS Jagan: “చంద్రబాబుది విలన్‌ క్యారెక్టర్‌.. నాడు మామకు.. ఇప్పుడు సీమకు!”

YSRCP chief YS Jagan: సీఎం చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై లిఫ్ట్‌పై సీఎం దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. భోగాపురం ఎయిర్‌పోర్టు విషయంలో చంద్రబాబు క్రెడిట్‌ చోరీకి పాల్పడ్డారని వైస్‌ జగన్‌ ధ్వజమెత్తారు. నేడు(గురువారం, జనవరి 8వ తేదీ) తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి జగన్‌ మీడియాతో మాట్లాడారు.

- Advertisement -

స్వార్థ రాజకీయాల కోసం సీమ ప్రజల్ని తాకట్టు: చంద్రబాబు తన స్వార్థ రాజకీయాల కోసం సీమ ప్రజల్ని తాకట్టు పెట్టారని వైస్‌ జగన్‌ ఆరోపించారు. ఇలాంటి చరిత్ర హీనులు దేశంలో ఎవరూ ఉండరని అన్నారు. చంద్రబాబు చరిత్ర హీనుగా మిగిలిపోతారని తెలిపారు. రాష్ట్రాన్ని చంద్రబాబు ఎలా తాకట్టు పెట్టారో తెలంగాణ సీఎం రేవంత్‌ చెప్పారని తెలిపారు. రాయలసీమ లిప్ట్‌ ఆపించామని సీఎం రేవంత్‌ నిండు అసెంబ్లీలో చెప్పిన అంశాన్ని గుర్తు చేశారు.

ALso read-CM Chandrababu : అమరావతికి చట్టబద్ధత కల్పించండి.. బడ్జెట్‌లో ఏపీకి ప్రాధాన్యమివ్వండి!

చంద్రబాబుది ఒక విలన్‌ క్యారెక్టర్‌: రాయలసీమ లిఫ్ట్‌పై వాస్తవాలు రాష్ట్ర ప్రజలకు తెలియాలని జగన్‌ అన్నారు. రాయలసీమ లిఫ్ట్‌ అవసరం లేదని సీఎం చంద్రబాబు ఎలా మాట్లాడుతారని ప్రశ్నించారు. అంటే.. వీళ్లకి రేవంత్‌కు మధ్య రహస్య ఒప్పందం కుదిరిందని తెలుస్తోందని అన్నారు. చంద్రబాబు క్లోజ్‌డోర్‌ మీటింగ్‌లో అడిగినట్లు.. తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రే చెప్పారని పేర్కొన్నారు. చంద్రబాబుది ఒక విలన్‌ క్యారెక్టర్‌ వైస్‌ జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

నాడు మామకు.. ఇప్పుడు సీమకు: చంద్రబాబు అండ్‌ కో బరితెగించి మాట్లాడటం చూస్తుంటే రేవంత్‌తో చీకటి ఒప్పందానికి అధికార ముద్ర వేసినట్లుందని జగన్‌ అన్నారు. తన స్వార్థం కోసం సొంత మామను వెన్నుపోటు పొడిచారని జగన్‌ ఆరోపించారు. అంతే కాకుండా తన స్వార్థం కోసం జన్మనిచ్చిన సీమకు వెన్నుపోటు పొడిచారని ధ్వజమెత్తారు.

Also read-Republic Day : అమరావతిలో తొలి గణతంత్రం.. రాజధానిలో అట్టహాసంగా వేడుకలకు సర్కారు సన్నాహాలు!

సీమకు చంద్రగ్రహణం: సీమ ఎల్లప్పుడూ పచ్చగా ఉండాలనే లక్ష్యంతో రాయలసీమ లిఫ్ట్‌ చేపట్టామని జగన్‌ అన్నారు. అందుకే 800 అడుగుల్లో రోజుకు 3 టీఎంసీలు తోడుకునేలా డిజైన్‌ చేశామని తెలిపారు. మా ప్రభుత్వంలో పనులను పరుగులు పెట్టించామని అన్నారు. అయితే నాడు రాయలసీమలో లిఫ్ట్‌ ఇరిగేషన్‌ను అడ్గుకోవడానికి చంద్రబాబే స్వయంగా కేసులు వేశారని అన్నారు. మా ప్రభుత్వం రాకపోవడం రాయలసీమ ప్రజల దురదృష్టమని జగన్‌ వ్యాఖ్యానించారు. రాయలసీమకు చంద్రగ్రహణం పట్టిందని ఎద్దేవ చేశారు. చంద్రబాబే దగ్గరుండి రాయాలసీమ లిఫ్ట్‌ను ఖూనీ చేశారని మండిపడ్డారు.

 

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News