HomeTop StoriesYSRCP: యువతకు అన్యాయం జరిగితే సహించేది లేదు

YSRCP: యువతకు అన్యాయం జరిగితే సహించేది లేదు

కోడుమూరు, తెలుగుప్రభ: ఉద్యోగాల కోసం ఎన్నో ఏళ్లుగా శ్రమిస్తున్న యువతకు అన్యాయం జరిగితే సహించేది లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఈసీ (స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ) సభ్యులు సభ్యులు కోట్ల హర్షవర్ధన్ రెడ్డి హెచ్చరించారు. ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడానికి నిరుద్యోగ యువకులు రాత్రింబవళ్లు కష్టపడి చదివి పరీక్షలకు సిద్ధమవుతారని, అలాంటి వారికి అక్రమాలతో అన్యాయం చేయాలని చూస్తే చూస్తూ ఊరుకోమని ఆయన ఘాటుగా స్పందించారు.

- Advertisement -

సీబీఐతో విచారణ…

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు డీఎస్సీ–2025 నియామకాల్లో జరిగిన అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ కోడుమూరులో వైసీపీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శనివారంతో మూడవ రోజుకు చేరుకున్నాయి. కోడుమూరు జడ్పిటిసి బి.రఘునాథరెడ్డి, పార్టీ కోడుమూరు మండల కన్వీనర్ బి.రమేష్ నాయుడు, యువజన నాయకులు సోమశేఖర్‌రెడ్డి, ఎంకె.వెంకటేష్, సాయి ముఖేష్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు జరుగుతున్నాయి. కోడుమూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్లో శిబిరం ఏర్పాటు చేసుకుని దీక్షలను కొనసాగిస్తున్నారు.

శనివారం నాడు కోట్ల హర్షవర్ధన్ రెడ్డి, వైసీపీ కోడుమూరు నియోజకవర్గ ఇంచార్జి డాక్టర్ ఆదిమూలపు సతీష్ లు దీక్ష శిబిరాన్ని సందర్శించి దీక్షలకు తమ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కోట్ల హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ డీఎస్సీ–2025 నియామకాలపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సీబీఐతో విచారణ జరిపించి కూటమి ప్రభుత్వం తమ నిజాయితీని నిరూపించుకోవాలన్నారు. సిబిఐ విచారణతో వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు.

పారదర్శకతకు కట్టుబడి ఉంటే సీబీఐ దర్యాప్తుకు వెనుకాడటం ఎందుకని కోట్ల హర్ష కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. డీఎస్సీ అక్రమాల వ్యవహారంలో రాజకీయ బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వైసీపీ కోడుమూరు నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ ఆదిమూలపు సతీష్ మాట్లాడుతూ విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీ ప్రకారం అర్హులైన నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇవ్వాలన్నారు. ల

యువతకు న్యాయం జరిగే వరకు..

యువతకు న్యాయం జరిగే వరకు, ప్రభుత్వం ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేసే వరకు పార్టీ ఆధ్వర్యంలో తాము ప్రజల పక్షాన పోరాటాన్ని కొనసాగిస్తామని డాక్టర్ ఆదిమూలపు సతీష్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు జడ్పిటిసి ప్రసన్నకుమార్, జిల్లా రైతు విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి బి.కృష్ణారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి, సి.బెళగల్ మండల కన్వీనర్ సోమశేఖర్ రెడ్డి, మైనార్టీ విభాగం జిల్లా కార్యదర్శి ఎస్.ఎం భాష, జిల్లా కార్మిక విభాగం ఉపాధ్యక్షులు ఆదాం, కోడుమూరు నియోజవర్గ పార్టీ నాయకులు ఎస్.రవి కుమార్ రెడ్డి, మల్లికార్జునరెడ్డి, తేనేశ్వరరెడ్డి, గోపాలు, సందప్ప, వెంకటేష్, లక్ష్మీ ప్రసాద్, జగదీష్, రవిశంకర్, జిందే ఈరన్న, వంశీ, వెంకటేష్, నారాయణ, భాష, శ్రీకాంత్, శ్యామ్, సురేష్, మద్దిలేటి, శీను గిడ్డయ్య, బైటింటి రమేష్, ఉప సర్పంచ్ కురువ మాధులు, లింగమయ్య, లింగన్న, రాఘవేంద్ర, నాగార్జున, తదితరులు పాల్గొన్నారు.

Also Read:Valmikis Protest:వాల్మీకులకు ఎస్టీ హోదా దక్కే వరకు పోరాటం ఆగదు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News