YSRCP Leaders Arrested: ఏపీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.కర్నూలులో ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని అర్థరాత్రి పూట అరెస్టు చేసిన పోలీసులు సోమవారం అనంతపురంలో మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ను అరెస్ట్ చేశారు. దాంతో ఉరవకొండ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
మంత్రి పయ్యావుల కేశవ్ ఆధ్వర్యంలో భూ ఆక్రమణలు పెరిగాయంటూ వైసీపీ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి నిరసనకు పిలుపునిచ్చారు. అయితే, ఈ నిరసనకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దాంతో విశ్వేశరరెడ్డి వైసీపీ నాయకులతో ఉరవకొండ తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టేందుకు రెడీ అయ్యారు.
గోరంట్ల మాధవ్‌ను కూడా…
విశ్వేశ్వరరెడ్డి చేపట్టిన ధర్నాకు హాజరయ్యేందుకు వెళ్లిన మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒక ఇంట్లో ఉన్న మాధవ్‌ను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు.
Also Read:Weather: ఏపీ,తెలంగాణలోని ఈ ప్రాంతాల్లో వానలే..వానలు

