సమిష్టి కృషితో వైఎస్ఆర్‌సీపీని మరింత బలోపేతం చేయాలి
పార్టీ శ్రేణులను సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకుంటాం:ఎంపీ మిథున్‌రెడ్డి,
అన్నమయ్య జిల్లా, రాయచోటి, తెలుగు ప్రభ.రాయచోటి పట్టణంలోని 11వ వార్డులో వైఎస్ఆర్‌సీపీ మైనారిటీ రాష్ట్ర కార్యదర్శి షబ్బీర్ నివాసంలో ఆదివారం సాయంత్రం రాజంపేట ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి, వైఎస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయంగా మమేకమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులతో ఆప్యాయంగా మాట్లాడి వారి సమస్యలు, స్థానిక పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మిథున్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. పార్టీ కోసం కష్టపడుతున్న ప్రతి ఒక్కరికీ అండగా ఉంటామని,నాయకులు,కార్యకర్తల మధ్య ఆత్మీయ అనుబంధమే పార్టీకి బలమని పేర్కొన్నారు.
పార్టీ శ్రేణులను సొంత కుటుంబ సభ్యుల మాదిరిగా చూసుకుంటామని, కార్యకర్తల కష్టసుఖాల్లో ఎల్లప్పుడూ భాగస్వాములుగా ఉంటామని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకొని, పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసే దిశగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని వారు పిలుపునిచ్చారు.
ఈ ఆత్మీయ కార్యక్రమంలో వైఎస్ఆర్‌సీపీ పట్టణ కన్వీనర్ నవాజ్, నాయకులు జాకీర్, గౌస్ ఖాన్, నవరంగ్ నిస్సార్, యూసుఫ్, షఫీఉల్లా, నిస్సాన్,ఎస్ ఎస్ బాష,జయచంద్రా రెడ్డి,బసిరెడ్డి,సోనీరాజ్ ఖళీమ్, సైదియా నియాజ్, రూపేష్,రఫిక్, తదితరనాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

