Wednesday, February 11, 2026
Homeవైరల్Pakistan: పాక్ పార్లమెంట్ లోకి గాడిద.. ట్రెండింగ్ లో వీడియో..

Pakistan: పాక్ పార్లమెంట్ లోకి గాడిద.. ట్రెండింగ్ లో వీడియో..

Donkey in Pakistan Parliament: పాకిస్తాన్ పార్లమెంట్ లో ఊహించని సంఘటన జరిగింది. ఎగువ సభ సెనేట్ లోకి ఓ గాడిద ప్రవేశించి గందరగోళం సృష్టించింది. కొందరు ఆశ్చర్యపోగా.. మరికొందరు నవ్వారు. ఈ సంఘటన ఫన్నీగా అనిపించినా.. సభ్యుల భద్రతపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. కాసేపట్లో అక్కడకు చేరుకున్న భద్రతా సిబ్బంది గాడిదను హాల్ నుంచి బయటకు పంపించేశారు. కానీ ఈ మెుత్తం సంఘటన పార్లమెంట్ సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో.. అది కొద్ది గంటల్లోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అన్ని సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ లో లక్షలాది మంది ఈ వీడియోను వీక్షించడంతోపాటు కామెంట్స్ కూడా చేశారు.

- Advertisement -

ఈ ఘటనపై సెనేట్ లోని కొంత మంది ఫన్నీగా చూడగా.. మరికొందరు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అంత మంది భద్రతా సిబ్బందిని దాటుకుని గాడిద సులభంగా పార్లమెంట్ హాల్ లోకి ఎలా ప్రవేశించిందా అని ఆరా తీస్తున్నారు. ఇందులో భాగంగా సెక్యూరిటీ సిబ్బంది సీసీటీవీ పుటేజీని పరిశీలిస్తున్నారు. అది ఏ గేటు ద్వారా లోపలికి వచ్చింది, భద్రతా లోపం ఎక్కడ అనే విషయాలపై దర్యాప్తు చేస్తున్నారు. పార్లమెంటు వంటి కట్టుదిట్టమైన భద్రతా ప్రదేశంలోకి జంతువు రావడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారి తీసింది.

 

Also Read: Girls Party – మందేస్తూ చిందేస్తున్న అమ్మాయిలు.. వైరల్ గా వీడియో..

ఈ వైరల్ వీడియోపై నెటిజన్స్ రకరకాల ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఇది ఏఐ ఎడిట్ వీడియో అని కొందరు అంటుంటే.. మరికొందరు ఇది నిజమైన వీడియో అని కామెంట్ చేస్తున్నారు. పాకిస్తాన్ పార్లమెంట్ ప్రాంగణంలోకి ఇలా జంతువులు రావడం తొలిసారేమీ కాదు.. గతంలోనూ విచ్చలవిడిగా యానిమల్స్ లోనికి వచ్చినట్లు రిపోర్ట్స్ తెలియజేస్తున్నాయి. తాజా చర్య పాకిస్తాన్ ఇజ్జత్ తీసినట్లు అయింది. ఇలాంటి చిన్న నిర్లక్ష్యం దేశానికి పెనుముప్పుగా పరిణమించే అవకాశం ఉంది. జంతువులు కూడా మన చట్టాలలో తమ పాత్రను పోషించాలనుకుంటున్నాయని సెనేట్ చైర్మన్ యూసఫ్ రజా గిలానీ ఫన్నీగా కామెంట్ చేశారు.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News