Heart Toching video: సృష్టిలో తల్లి ప్రేమను మించినది మరోకటి లేదు. ఆ నిస్వార్థమైన అమ్మ ప్రేమను వర్ణించడానికి మాటలు చాలవు. తల్లి పేదరాలు అయినా ప్రేమను పంచడంలో మాత్రం కుబేరుడు కూడా ఆమెకు సాటిరాడు. అమ్మ ప్రేమను మించిన స్వర్గం మరొకటి ఉండదు.
అలాంటి మాతృమూర్తి వాత్సల్యాన్ని తుంగలో తొక్కి కర్కశంగా ప్రవర్తిస్తున్నారు పిల్లలు. కాలు చేయో వంగితే చాలు వెంటనే వారిని ఓల్డ్ ఏజ్ హోమ్ లోకి, రోడ్డు మీద విడిచిపెట్టడమో చేస్తున్నారు. ఇలాంటి కుమారులకు సంబంధించిన ఘటనలు తరుచూ వార్తల్లో చూస్తున్నా ఉంటాం. కానీ తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఓ బాలుడు తన తల్లికి నిద్రభంగం కాకుండా చేసిన పని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
వీడియో ఓపెన్ చేస్తే.. విధులు ముగించుకుని ఓ మహిళ తన చిన్నారి బాలుడితో కలిసి మెట్రో ట్రైన్ ఎక్కుతుంది. ఈ క్రమంలో ఆమె అదమరిచి నిద్రపోతుంది. పక్కనే ఉన్న చిన్నారి బాలుడు తల్లి పడిపోకుండా తన చిట్టి చేతులను అడ్డుపెట్టి సపోర్టు ఇచ్చాడు. ఈ హార్ట్ టచింగ్ సంఘటన కోల్‌కతా మెట్రోలో కనిపించింది.
Also Read: Python Video-కిస్ పెట్టబోతే కొరికేసిన కొండచిలువ.. కట్ చేస్తే..!
అమ్మ పట్ల ఆ చిన్నారి ప్రేమ, తీసుకున్న కేరింగ్ అక్కడ ఉన్న ప్రయాణికులను ఆశ్చర్య పరిచింది. దీనిని వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది. నాలుగు నిమిషాల పాటు ఉన్న ఈ వీడియో నెటిజన్స్ కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు. తల్లిదండ్రులు తమ కష్టం పిల్లలకు తెలిసేలా పెంచితే ఇలాంటి మంచి సుగుణాలే అబ్బుతాయని నెటిజన్స్ అంటున్నారు. మెుత్తానికి ఈవీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.


