A little girl Shoos Away Snake From House: వాన కాలంలో అడవుల్లో ఉండాల్సిన పాములు ఇళ్లలోకి వచ్చేస్తుంటాయి. ఇవి ఇంట్లో ఏదో మూలన నక్కి భయబ్రాంతులకు గురి చేస్తూ ఉంటాయి. కానీ తాజాగా అలాంటి పాము వీడియోనే ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. భారీ పాము ఓ ఇంట్లోకి దూరుతుంది. అది ఒక మూలన నక్కి ఉంటుంది. ఇంతలో దానిని ఆ ఇంటి యజమాని కూతురు చూస్తుంది. ఆ పాపకు నాలుగేళ్లు ఉండవచ్చు. పామును చూసిన విషయాన్ని వచ్చి తండ్రికి చెబుతుంది. అతడు ఏ మాత్రం కంగారు పడకుండా తన కూతురుని ఆ పామును బయటకు పంపించేలా ప్రోత్సహిస్తాడు. ముందుగా ఆ బుడ్డది భయపడిన నాన్న ఉన్నాడనే ధైర్యంతో ఆ పాము వద్దకు వెళ్తుంది. ముందుగా ఓ చిన్న మాపు కర్రను పట్టుకుని సర్పాన్ని బెదిరిస్తుంది. ఆ పాము నెమ్మదిగా పాకుతూ ఉంటుంది. అది చూడటానికి పది అడుగులు ఉంటుంది. అయినా సరే ఆ పాప ఏమాత్రం భయపడకుండా పాము వెంట పడుతుంది.
ఆ స్నేక్ ఇంటి ప్రధాన గుమ్మం నుంచి బయటకు వెళ్లే సమయంలోనే బయటకు వెళ్లిన ఆ పాప తల్లి తిరిగి వస్తుంది. ఆ చిన్నారి సర్పాన్ని బయటకు పంపడం చూసి ఆమె ఆశ్చర్యపోతుంది. తండ్రి ఇచ్చిన ప్రోత్సాహంతో సక్సెస్ పుల్ గా ఆ బుడ్డది ప్రమాదకరమైన పామును బయటకు పంపించడం చూసి నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట ట్రెండింగ్ లో ఉంది. ఈ ఘటన ఆస్ట్రేలియాలో చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ వీడియో ‘MATT WRIGHT’ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయబడింది. ఇప్పటి వరకు 182K కంటే ఎక్కువ లైక్‌లు వచ్చాయి. కుమార్తెకు ధైర్యం చెప్పి సమస్యను ఎలా పరిష్కారించాలో నేర్పించిన ఆ తండ్రిని అందరూ పొగుడుతున్నారు.
Also Read: King Cobra- అరుదైన నాలుగు తలల నాగు పామును ఎప్పుడైనా చూశారా? వీడియో ఇదిగో..
సోషల్ మీడియాలో ఈ మధ్య స్నేక్ వీడియోలు తెగ ట్రెండ్ అవుతున్నాయి. పాముల వీడియోలను చూసేందుకు జనాలు తెగ ఆసక్తి కనబరుస్తున్నారు. ముఖ్యంగా కింగ్ కోబ్రా, కొండ చిలువ, శ్వేతనాగు, అనకొండకు సంబంధించిన వీడియోలను చూసేందుకు నెటిజన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కంటెంట్ క్రియేటర్స్ కూడా ఇలాంటి వీడియోలనే ఎక్కువగా నెట్టింట డంప్ చేస్తున్నారు.


