Man kicks Boy viral video: రోడ్డుపై ఆడుకుంటున్న చిన్నారిని అకారణంగా కాలితో తన్ని గాయపరిచాడు ఓ వ్యక్తి. ఫుట్‌బాల్‌లా బలంగా తన్నడంతో పాపం ఆ బాలుడు బొక్కబోర్లా పడ్డాడు. పక్కనే బంధువులు, పొరుగింటి వారు ఉన్నా కూడా ఏ మాత్రం భయం లేకుండా దారుణానికి పాల్పడ్డాడు. కర్ణాటకలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read: https://teluguprabha.net/international-news/democrats-have-released-more-photos-in-the-jeffrey-case/
బెంగళూరులోని త్యాగరాజ నగర్‌లో రోడ్డుపై తన మేనత్త, పక్కింటి వారితో కలిసి ఐదేళ్ల బాలుడు నీవ్ జైన్ షటిల్ ఆడుతున్నాడు. ఈ క్రమంలో వెనుక వైపు నుంచి వస్తున్న ఓ వ్యక్తి.. హఠాత్తుగా నీవ్‌ను కాలితో బలంగా తన్నాడు. దీంతో బాలుడు బొక్కబోర్లా పడ్డాడు. కానీ ఆ వ్యక్తి తనకేమీ తెలియదన్నట్లుగా అక్కడి నుంచి నింపాదిగా ముందుకు వెళ్లిపోయాడు. ఘటనలో బాలుడి కంటికి గాయాలయ్యాయి. ఊహించని ఘటనతో చుట్టుపక్కల వారు షాక్‌కు గురయ్యారు. ఆ మార్గంలో వెళ్తున్న ఓ బైకర్.. ఏం జరుగుతుందో అర్థం కాక బైక్ ఆపి చూస్తూ ఉండిపోయాడు.
సంఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయ్యాయి. ఈ వీడియోను పోలీసులకు ట్యాగ్ చేయడంతో రంగంలోకి దిగారు. నిందితుడు రంజన్‌గా గుర్తించారు. అదుపులోకి తీసుకున్న బనశంకరి పోలీసులు అతడిని కోర్టులో హాజరుపరిచారు. రంజన్‌కు జ్యుడీషియల్ కస్టడీ విధించినా అతను బెయిల్‌పై విడుదలైనట్లు సమాచారం. నిందితుడి మానస్థిక స్థితి సరిగా లేదని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: https://teluguprabha.net/telangana-news/telangana-speaker-dismisses-brs-mla-disqualification-pleas/
కాగా, రంజన్, బాలుడి కుటుంబం ఇరుగుపొరుగువారే అని స్థానికులు తెలిపారు. ఘటనపై నివాసితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభం శుభం తెలియని బాలుడిపై రాక్షసుడిలా దాడి చేసిన కిరాతకుడు జైలులోనే ఉండాలని నెటిజన్లు డిమాండ్ చేశారు.
हमारे आसपास कितने हैवान जैसे लोग रहते हैं।
बेंगलेरु में बच्चे अपने परिजनों के साथ गली में खेल रहे हैं और कोई शख्स आकर देखें 5 साल के बच्चे को किस तरह पीछे से मारता है। बच्चे को गंभीर चोट लगी है ।
दोषी पुलिस हिरासत में है! pic.twitter.com/4EiH07WMAK— Narendra Nath Mishra (@iamnarendranath) December 19, 2025

