Saturday, November 15, 2025
Homeవైరల్Toothpick: డిన్నర్‌లో నోరూరించే చికెన్.. తెల్లారేసరికి ఆస్పత్రిలో.. కంగుతిన్న డాక్టర్లు!

Toothpick: డిన్నర్‌లో నోరూరించే చికెన్.. తెల్లారేసరికి ఆస్పత్రిలో.. కంగుతిన్న డాక్టర్లు!

Toothpick in stomach: ఓ వ్యక్తి డిన్నర్‌లో లొట్టలేసుకుంటూ నోరూరించే చికెన్ ఆరగించాడు. సీన్ కట్ చేస్తే.. తెల్లారేసరికి ఆస్పత్రిలో ఉన్నాడు. అక్కడున్న డాక్టర్లు సీటీ స్కాన్ చేయగా అసలు విషయం బయటపడింది. అది చూసి డాక్టర్లు సైతం అవాక్కయ్యారు. ఇంతకీ సీటీ స్కాన్ చేయగా ఏం తెలిసిందో తెలుసా.! తెలుస్తే మీరు అవాక్కవాల్సిందే!

- Advertisement -

ఓ వ్యక్తి తన డిన్నర్‌లో లొట్టలేసుకుంటూ చికెన్ తిన్నారు. నోటిలో టూత్‌పిక్‌ను పెట్టుకుని మర్చిపోయి నిద్రపోయి అలానే నిద్ర పోయారు. మరుసటి రోజు తీవ్రమైన నొప్పితో బాధపడ్డాడు. రోజంతా తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతూ.. అసలు అదెందుకు వచ్చిందో తెలియక సతమతంయ్యాడు. వెంటనే ఆసుపత్రికెళ్లాడు. సదరు రోగికి డాక్టర్లు సీటీ స్కాన్ చేయగా.. 3.7 సెంటీమీటర్లు ఉన్న టూత్‌పిక్ ఒకటి అతడి కడుపులో ఉన్నట్లు గుర్తించారు. లాపరోస్కోపీ ద్వారా ఆ టూత్‌పిక్.. పేగులను చిల్లులు చేసిందని గుర్తించారు.

Also Read: https://teluguprabha.net/viral/a-heart-touching-scene-from-the-kolkata-metro-train-video-goes-trending-on-google/

మరణాల రేటు కేవలం 10 శాతం మాత్రమే: టూత్‌పిక్ ఉన్న ప్రదేశంలో కొంతమేరకు రక్తస్రావం జరిగింది. స్టెరైల్ స్పాంజ్ ఉపయోగించి డాక్టర్లు దాన్ని శుభ్రం చేశారు. ఆ తర్వాత శస్త్రచికిత్స నిర్వహించి టూత్‌పిక్ ను విజయవంతంగా తొలగించారు. ఈ ఘటన సౌదీ అరేబియాలో జరిగింది. శస్త్రచికిత్స తర్వాత మూడు రోజులకు సదరు వ్యక్తి డిశ్చార్జ్ అయ్యాడు. దీని వల్ల సంభవించే మరణాల రేటు కేవలం 10 శాతం మాత్రమేనని డాక్టర్లు తెలిపారు. మొదటగా వైద్యులు చికెన్ వల్ల ఇలా జరిగిందని అనుకున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad