Rajgarh Woman Suffers from Rare Disorder: విజ్ఞానం అభివృద్ధి చెందే కొద్దీ రోగాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ఎంత టెక్నాలజీ పెరిగినా కొన్ని వ్యాధులకు మాత్రం మెడిసిన్ కనిపెట్టలేకపోతున్నాం. తాజాగా అలాంటి ఓ అరుదైన జబ్బు మధ్యప్రదేశ్ లో వెలుగు చూసింది. దీని గురించి తెలిసిన వారంతా ఇలాంటి వ్యాధి ఒకటి ఉంటుందా అని ఆశ్యర్యపోతున్నారు. ఇంతకీ ఆ రోగం ఏంటి? ఆ మహిళకు ఎలా వచ్చింది? దానికి చికిత్స ఉందా లేదా? తదితర విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్‌లో ఒక మహిళ రేర్ డిసీజ్ తో బాధపడుతోంది. ఈ వ్యాధి సోకిన వారు రోజంతా ఆకలితో అలమటిస్తారు. బాధితులు ఎంత తిన్నా వారికి ఆకలి వేయదు. బాధిత మహిళ ఈ రోగం నయం కావడానికి లక్షల రూపాయలు ఖర్చు చేసింది, అయినా సరే లాభం లేకపోయింది. వైద్యులు కూడా ఈ వ్యాధి ఏంటనేది తెలుసుకోలేకపోయారు. ఇప్పటికీ కూడా ఈ జబ్బుకు గల కారణాలు తెలియరాలేదు.
తరుచూ ఏదో ఒకటి తినకపోతే.. ఆమె శరీరం శక్తిహీనంగా మారిపోతుందని బాధిత మంజు కుటుంబ తెలిపింది. సాధారణంగా ఏ వ్యక్తి అయినా మూడు నుంచి నాలుగు రొట్టెలు తింటే ఆకలి తీరిపోతుంది. కానీ, మంజు ఒకేసారి 10-12 రొట్టెలు లేదా రోటీలు తింటే గానీ ఆమె ఆకలి తీరదని వారు చెబుతున్నారు. అలా మంజు ఒక్క రోజులో దాదాపు 50 నుంచి 60 రొట్టెలు లాగించేస్తుందట. ఈ వ్యాధి గురించి కొంత మంది వైద్యులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.
ఇదే అసలు కారణమా!
అతిగా ఆకలి వేయడం అనేది మానసిక రోగమని ఆరోగ్య నిపుణులు వెల్లడిస్తున్నారు. దీనిలో బాధిత రోగి నిత్యం ఆకలితో అలమటిస్తూ ఉంటాడు. అతడు లేదా ఆమె తినాల్సిన అవసరం ఉందా లేదా అనేది కూడా వారికి తెలియదు. ఇది ఒక సైకియాట్రిక్ డిజార్డర్ అని వైద్యులు చెబుతున్నారు. కొన్నిసార్లు ఇది బింగే ఈటింగ్ డిజార్డర్ కారణంగా కూడా వస్తుందని వారు అంటున్నారు. ఈ సమస్య సాధారమైనది కాదని.. ఈ సమయంలో ట్రీట్మెంట్ ఆలస్యం చేయడం శరీరం, మనస్సు రెండింటికీ ప్రమాదమని మధ్యప్రదేశ్‌లోని ఫరీదాబాద్‌లోని అమృత హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ మీనాక్షి జైన్ తెలిపారు.
Also Read: King Cobra -డబ్బుకు కాపలా కాస్తున్న మూడు అరుదైన నాగు పాములు.. వీడియో ఇదిగో!
ప్రభుత్వానికి విజ్ఞప్తి
ఈ వ్యాధి కారణంగా ఆ మంజు కుటుంబ ఆర్థికంగా ఇబ్బంది పడుతుంది. ఇప్పటి వరకు ట్రీట్మెంట్ కోసం దాదాపు 5-7 లక్షల రూపాయలు ఖర్చు చేశారట. వారి వద్ద ఉన్న డబ్బు మెుత్తం అయిపోవడంతో ఆ ఫ్యామిలీ సహాయం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఎవరైనా సహాయం చేస్తేనే ఆ మహిళకు తదుపరి చికిత్స సాధ్యమవుతుంది.
Also Read: Tamil Nadu – పనిచేసే చోట ప్రేమ.. హిజ్రా అని తెలిసి కూడా పెళ్లాడిన యువకుడు..


