Police Constable sentenced for 30 years: విధుల్లో ఉండగా రూ. 20 లంచం తీసుకున్నాడనే ఆరోపణలతో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 30 ఏళ్లు జైలు శిక్ష అనుభవించాడు. చివరికి విచారణలో తనేం తప్పేం లేదని తేలింది. 30 ఏళ్ల జైలు జీవితం తర్వాత కుటుంబీకులతో సంతోషంగా గడపాల్సిన వ్యక్తి బతుకు ఏమయ్యిందో తెలిస్తే కన్నీళ్లు ఆగవు.. ఇంతకీ ఏం జరిగింది.. ఆ వ్యక్తం ఏమయ్యారు..? పూర్తి సమాచారం ఈ కథనంలో..
గుజరాత్‌లో ప్రజాపతి అనే పోలీస్ కానిస్టేబుల్ రూ.20 లంచం తీసుకున్నాడనే ఆరోపణలతో 30 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించారు. కానీ ఇప్పుడు కోర్టు తీర్పుతో నిర్దోషిగా బయటకు వచ్చాడు. కోర్టు తీర్పు తర్వాత ప్రజాపతి చెప్పిన మాటలు ఆవేదన కలిగిస్తున్నాయి. “నా జీవితం నుంచి కళంకం తొలగిపోయింది. ఇప్పుడు దేవుడు నన్ను తీసుకెళ్లినా, నాకు ఎలాంటి దుఃఖం ఉండదు.” అని ఫిబ్రవరి 4న గుజరాత్ హైకోర్టు తన తీర్పులో ప్రజాపతి నిర్దోషి అని చెప్పిన తర్వాత ఆయన చెప్పిన చివరి మాటలు ఇవి..
1996లో ఏం జరిగిందంటే..
బాబూభాయ్ ప్రజాపతి అహ్మదాబాద్‌లో పోలీస్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో ఆయనపై రూ. 20 లంచం తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. దీంతో అవినీతి నిరోధక చట్టం కింద ప్రజాపతి అభియోగాలు మోపారు. 1997లో సెషన్స్ కోర్టులో అతనిపై చార్జిషీట్ దాఖలైంది. 2002లో అభియోగాలు నమోదు కాగా.. సాక్షుల విచారణ 2003లో ప్రారంభమైంది. 2004లో, సెషన్స్ కోర్టు ప్రజాపతికి నాలుగు సంవత్సరాల జైలు శిక్ష, రూ. 3,000 జరిమానా విధించింది.
సెషన్స్ కోర్టు నిర్ణయాన్ని ప్రజాపతి గుజరాత్ హైకోర్టులో సవాలు చేశారు. ఆ తర్వాత, ఆయన అప్పీల్ 22 సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉండగా.. ఈ ఏడాది ఫిబ్రవరి 4న ప్రజాపతి నిర్దోషిగా హైకోర్టు తీర్పు వెలువరించింది. సాక్షుల వాంగ్మూలాలలో తీవ్రమైన వైరుధ్యాలు ఉన్నాయని, అభియోగాలను నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని కోర్టు పేర్కొంది.
ప్రజాపతి తరపున వాదించిన న్యాయవాది నితిన్ గాంధీ.. మొత్తం కేసు అనుమానం మీద ఆధారపడి ఉందని కోర్టు ఎదుట పేర్కొన్నారు. తీర్పు తర్వాత ప్రజాపతి ఇంటికి చేరుకున్నారు. ఆ మరుసటి రోజే, సహజ కారణాల వల్ల మరణించారు. ఆయన మరికొంత కాలం బతికి ఉంటే చూసి ఉంటే చాలా ఆనందంగా ఉండేదని ఆయన శ్రేయోభిలాషులు పేర్కొనడం స్థానికులకు ఆవేదన కలిగించింది. ప్రజాపతి నిర్దోషిగా విడుదలైనందుకు చాలా సంతోషంగా ఉన్నారని.. అంతలోనే ఇలా జరగడం దురదృష్టకరమని నితిన్ గాంధీ వ్యాఖ్యానించారు. జైలు నుంచి విడుదలయ్యాక ప్రభుత్వం నుంచి పొందే అన్ని ప్రయోజనాలకు దరఖాస్తు చేసుకోవాలని చెప్పానని.. మరుసటి రోజే ఆయన గుండెపోటుతో మరణించారని విచారం వ్యక్తం చేశారు.

