Alekhya Chitti Pickles Ramya Moksha Viral Video: తెలుగు రాష్ట్రాల్లో అలేఖ్య చిట్టి పికిల్స్ గురించి తెలియని వారంటూ ఎవరూ ఉండరు. నెట్టింట పచ్చళ్ల బిజినెస్ చేస్తూ..సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ ఓ రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకున్నారు ముగ్గురు అక్కచెల్లెళ్లు. ఎంత ఫేమస్ అయ్యారో.. తమ నోటి దూలతో అన్నే విమర్శలు మూటగట్టుకున్నారు. పచ్చళ్ల ధరలు ఎక్కువగా ఉన్నాయని కస్టమర్ ప్రశ్నించినందుకు బూతులతో రెచ్చిపోయింది ఓ సిస్టర్. దీంతో వీరిపై జనాల్లో నెగిటివిటీ పెరిగిపోయి.. పచ్చళ్లు దుకాణం మూసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఆ తర్వాత ఈ అక్కా చెల్లెళ్లు సింపతి వీడియోలు చేసిన పెద్దగా వర్కౌట్ అవ్వలేదు.
బిగ్ బాస్ అవకాశం
అయితే ఈ ముగ్గురు సిస్టర్స్ లో రమ్య మోక్షకు మాంచి ఫాలోయింగ్ ఉంది. ఈ అమ్మడకు అందంతోపాటు తెలివితేటలు ఎక్కువే. ఈ మధ్యనే రమ్య పికెల్స్ పేరుతో మరో దుకాణం తెరిచింది ఈ ముద్దుగుమ్మ. అంతేకాకుండా రమ్యకు ఇన్ స్టాలో భారీగా ఫాలోవర్స్ ఉన్నారు. ఎప్పటికప్పుడు ఈ బ్యూటీ తన గ్లామరస్ ఫోటోలతో నెటిజన్స్ ను ఆకట్టుకుంటూ ఉంటుంది. త్వరలోనే ఈ చిన్నది బిగ్ బాస్ లోకి అడుగుపెట్టబోతున్నట్లు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అయితే తాజాగా రమ్యకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తోంది.
ఇందులో రమ్య ఫిట్ నెస్ పెంచుకునే పనిలో పడింది. బాత్రూమ్ లో బట్టలు తీసి జబ్బలు, వీపును చూపించడం కనిపిస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది. ఈ వీడియోపై నెట్టింట భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే బిగ్ బాస్ కోసం రమ్య సిద్దమవుతోందని.. అందులో భాగంగానే ఇలాంటి ఇన్ స్టా రీల్స్ చేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.
సినిమా ఛాన్స్..
మరోవైపు రమ్య సినిమాల్లో కూడా అవకాశాలను చేజిక్కించుకుంటున్నట్లు సమాచారం. ఇటీవల అశ్విన్ బాబు హీరోగా నటిస్తున్న ‘వచ్చిన వాడు గౌతమ్’ మూవీ ప్రమోషన్స్ లో ఆమె స్పెషల్ ఎట్రాక్షన్ అని చెప్పాలి. ఇందులో హీరోయిన్ గా రియా సుమన్ నటిస్తుండగా..రమ్య మరో కీలకపాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Also read: Tamanna – హీరోయిన్ ని తీసేయండి అన్న స్టార్ హీరోనే..క్షమాపణలు చెప్పాడు!


