American Youtuber Tyler Oliveira Gorehabba: భారత్‌లో జరిగే సంప్రదాయ పండుగకు సంబంధించిన వేడుకల వీడియో ఇప్పుడు నెట్టింట్లో విమర్శల పాలైంది. ఒక్కొక్కరు ఒక్కోలా కామెంట్ చేస్తున్నారు. అసలు ఏంటా పండుగ.? ఎక్కడ జరిగింది.? పూర్తి వివరాల్లోకి వెళితే.
కర్ణాటకలో ఇటీవల దీపావళి సందర్భంగా ‘గోరెహబ్బ’ పండుగను అట్టహాసంగా జరుపుకొన్నారు. అక్కడి ప్రజలు తమ గ్రామ దేవత బీరేశ్వర స్వామి ఆవు పేడ నుంచి జన్మించాడని నమ్ముతారు. అందువల్ల నివాసితులు ఒకరిపై ఒకరు ఆవు పేడను చల్లుకుంటూ ప్రతి ఏటా ఈ పండుగను ఎంతో సంప్రదాయబద్ధంగా సంతోషంగా జరుపుకొంటారు. ఇది ఎప్పటి నుంచో ఉన్న సంప్రదాయం. అయితే ఈ వేడుకను చూడటానికి అమెరికాకు చెందిన ప్రముఖ యూట్యూబర్ టైలర్ ఒలివెరా వచ్చారు. ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
‘గోరెహబ్బ’ వేడుకలో ఒకరిపై ఒకరు పేడ చల్లుకునే సమయంలో.. అమెరికన్ యూట్యూబర్ టైలర్ ఒలివెరాపై కూడా పేడ చల్లారు. అందులో పూర్తిగా ముంచారు. ఇందుకు సంబంధించిన వీడియోను టైలర్ తన యూట్యూబ్ ఛానల్‌లో పోస్ట్ చేశాడు. ఇందులో ఒలివెరా షూట్, గాగుల్స్ ధరించి ఆవు పేడతో కనిపిస్తాడు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పలువురు విమర్శలు చేస్తున్నారు.
విదేశీ యూట్యూబర్‌ను పేడలో ముంచడం ఏంటని, పరువు తీశారు కదా అని కొందరు కామెంట్లు చేస్తుండగా.. మరికొందరు యూట్యూబర్‌ను విమర్శిస్తున్నారు. ఇలా ఒక సంప్రదాయమైన పండుగను వీడియో తీసి యూట్యూబ్‌లో పెట్టడం కరెక్ట్ కాదని, పండుగ వెనుక సాంప్రదాయాన్ని, భక్తిని గౌరవించాల్సిన అవసరం ఉందని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు.
Also Read: https://teluguprabha.net/viral/insta-reel-saves-old-man-life-viral-video/
అయితే ఈ వీడియోకు వచ్చిన కామెంట్లపై ఒలివెరా కూడా స్పందించాడు. ఈ వేడుకను చూసేందుకు 10,000 మైళ్లు ప్రయాణించి వేల డాలర్లు ఖర్చు చేసి వచ్చానని చెప్పాడు. ఇలా వీడియో తీసి పెట్టడం వల్ల తప్పు లేదని పేర్కొన్నాడు. భారత సాంస్కృతిక సంప్రదాయాన్ని అనుభవించడమే తన ఉద్దేశ్యమని స్పష్టం చేశాడు.
YouTuber Tyler Oliveira attended a cow dung throwing festival in India.
https://t.co/xUCwPIZybF— ADAM (@AdameMedia) October 24, 2025


