Baby Elephant Video viral on Social Media: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక కొన్ని వందల వీడియోలను వీక్షించే అవకాశం మనకు కలుగుతుంది. ఈ వీడియోల్లో కొన్ని ఫన్నీగా ఉంటే, మరికొన్ని ఆశ్చర్యానికి గురి చేస్తే, ఇంకొన్ని మనల్ని ఎడ్యుకేట్ చేసేలా ఉంటాయి. ఈ మధ్య నెట్టింట జంతువులకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా పాములు, ఏనుగులు, పులుల వీడియోలు ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి యూజర్స్ ను ఆకట్టుకుంటోంది. ఈ వీడియోలో ఓ బేబీ ఏనుగు చేసిన పనికి అందరూ ఫిదా అవుతున్నారు.
ఈ వీడియో ఓపెన్ చేస్తే.. కొన్ని ఏనుగులు రోడ్డు మీద నడుస్తుంటాయి. ఒక భారీ ఏనుగుపైన మావటి వాడు కూర్చుని ఉంటాడు. ఆ ఏనుగు వెనుక మిగతావి నడుస్తున్నాయి. ఆ గజరాజుల గుంపులో ఉన్న ఓ బుల్లి ఏనుగు అందరికంటే వెనుకలా ఉంటుంది. ఇంతలో దానికి రోడ్డుపై చెరుకు బండి కనిపిస్తుంది. అది అక్కడకు వెళ్తుంది. సడన్ గా ఏనుగు వచ్చే సరికి బండి దగ్గర ఉన్న మహిళ భయపడుతుంది. తర్వాత ఆ బుల్లి ఏనుగు క్యూట్ నెస్ చూసి తనకు చెరుకు గడ ఇస్తుంది. ఆ మహిళ చెరుకు గడ ఇవ్వగానే దానిని పట్టుకుని మిగతా ఏనుగుల దగ్గర పరిగెడుతోంది ఈ గున్న ఏనుగు.
ఈ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నంద తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వేలల్లో లైక్స్ వస్తున్నాయి. వందల్లో కామెంట్లు కూడా వచ్చాయి. ఇప్పటికే 60వేల మందికిపైగా వీక్షించారు. ఈ ఏనుగు వీడియోపై నెటిజన్స్ కామెంట్లు జల్లు కురిపిస్తున్నారు. ఈ ఏనుగు ఎంతో మర్యాదగా ప్రవర్తించిందని ఒకరు అంటే.. ఫారెస్ట్ లో తిరగాల్సిన గజరాజులు పట్టణంలో ఉండాల్సి రావడం విషాదకరమని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ క్యూట్ వీడియో నెట్టింట తెగ హల్ చల్ చేస్తోంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఓ లుక్కేయండి.