Saturday, November 15, 2025
Homeవైరల్Barrelakka: ఏం ప్రశ్నలు అడుగుతున్నారో మీకైనా తెలుస్తుందా..?

Barrelakka: ఏం ప్రశ్నలు అడుగుతున్నారో మీకైనా తెలుస్తుందా..?

Barrelakka Viral Video:రెండు తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష మరోసారి వార్తల్లోకి వచ్చింది. సోషల్ మీడియాలో తరచుగా చర్చకు వస్తూ, ఎన్నో సందర్భాల్లో హాట్ టాపిక్‌గా మారిన ఆమె ఈసారి తన వ్యక్తిగత సమస్యల కారణంగా అందరి బాగా
వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆమె శరీర సమస్యలు, తాను ఎదుర్కొంటున్న ఇబ్బందులను చెబుతూ కనిపించింది.

- Advertisement -

నిరుద్యోగుల తరఫున..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో నిరుద్యోగుల తరఫున బరిలో నిలబడి ఒక్కసారిగా ప్రజల మధ్య తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క, ఆ తర్వాత చాలా సందర్భాల్లో వార్తల్లో నిలిచింది. రాజకీయ, సినీ వర్గాల మద్దతు లభించడం, ఆ తర్వాత సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ కావడంతో ఆమె పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తరించింది. అప్పటి నుంచి చిన్న చిన్న విషయాలకే బర్రెలక్క వార్తల్లోకి వస్తూ ఉంటుంది. కొన్ని సార్లు వ్యక్తిగత విషయాలు, మరికొన్ని సార్లు ట్రోలింగ్ కారణంగా ఆమె సోషల్ మీడియాలో హైలైట్ అయ్యింది.

ఆరోగ్యం బాగా దెబ్బతిన్నట్లు..

తాజాగా ఆమె షేర్ చేసిన వీడియోలో తన ఆరోగ్యం బాగా దెబ్బతిన్నట్లు తెలిపింది. గత మూడు రోజులుగా విపరీతమైన జ్వరం బాధిస్తోందని, తలనొప్పి, జలుబుతో చాలా ఇబ్బంది పడుతున్నానని ఆమె చెప్పింది. ముఖ్యంగా జలుబు కారణంగా చాలా అసౌకర్యంగా ఉందని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ వీడియోలో ఆమె కన్నీటి పర్యంతమవుతూ తన పరిస్థితిని వివరించడం చూసి నెటిజన్లు, అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

ఆగ్రహం వ్యక్తం..

ఆమె చెప్పిన విషయాల్లో ముఖ్యమైనది, జ్వరంతో బాధపడుతూ వీడియో షేర్ చేసినప్పటికీ కొందరు వ్యక్తులు అసంబద్ధమైన కామెంట్లు పెడుతున్నారని బాధపడటం. తన ఆరోగ్యం గురించి ఆరా తీయాల్సిన సమయంలో పిచ్చి ప్రశ్నలు అడుగుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. తాను అనారోగ్యంతో ఉంటే “జ్వరం తగ్గిందా, ఇప్పుడు ఎలా ఉన్నావు, మందులు వేసుకున్నావా” అని అడగాలని, కానీ అందుకు బదులుగా వింతగా కామెంట్లు చేస్తున్నారని ఆమె తెలిపింది.

బిడ్డ ఆరోగ్యంపై ప్రభావం..

అందులో ముఖ్యంగా తల్లి అవ్వబోతున్న శిరీషపై కొందరు వ్యక్తులు ఆమె గర్భానికి సంబంధించిన ప్రశ్నలు అడగడం ఆమెను తీవ్రంగా కలచివేసింది. “నాకు జ్వరం వస్తేనే నా బిడ్డ ఆరోగ్యంపై ప్రభావం ఉంటుంది కదా, అప్పుడు ఆ బిడ్డ బాగానే ఉందా అని అడగడం ఎంతవరకు సబబు” అని కన్నీటి పర్యంతమై చెప్పింది. తాను ఆరోగ్యంగా ఉంటేనే శిశువు కూడా ఆరోగ్యంగా ఉంటుందని స్పష్టంగా తెలిపింది.

ఈ వీడియో బయటకొచ్చిన వెంటనే సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. అభిమానులు ఆమెకు మద్దతు తెలుపుతూ, ఆరోగ్యంపై జాగ్రత్త వహించమని సలహాలు ఇస్తున్నారు. మరోవైపు కొంతమంది నెటిజన్లు అసంబద్ధమైన ప్రశ్నలు అడుగుతూ ఆమెను మరింత కలతపెట్టినట్లు వ్యాఖ్యలు వ్యక్తమవుతున్నాయి.

Also Read: https://teluguprabha.net/viral/massive-18km-queue-for-lalbaugcha-raja-2025-darshan-devotees-wait-overnight/

బర్రెలక్క గతంలో కూడా ట్రోలింగ్ కారణంగా కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న వదంతులు, పిచ్చి పిచ్చి కామెంట్లు తనను తీవ్రంగా బాధిస్తున్నాయని పలుమార్లు తెలిపింది. ఈసారి కూడా అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇలాంటి మాటలు వింటే మరింత కష్టంగా ఉంటుందని ఆమె భావోద్వేగంగా చెప్పింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad