Bhavita Mandava channel show: కళ్లలో ధైర్యం, ముఖంలో ఆత్మవిశ్వాసం, నడకలో హుందాతనం.. కలగలిసి పాతికేళ్ల హైదరాబాదీ చిన్నది ఫ్యాషన్ ప్రపంచంలో సంచలనం సృష్టిస్తోంది. గ్లోబల్ రన్‌వేపై అద్భుత విజయాలు సాధిస్తూ సోషల్ మీడియా చూపు తనవైపునకు తిప్పుకొంది. ఫ్యాషన్ ప్రపంచంలో కొత్త స్టార్‌గా తన ‘భవిత’వ్యాన్ని పూల పాన్పుగా మార్చుకుంటున్న భవిత మందవ.. తెలుగమ్మాయి కావడం యావత్ దేశానికి గర్వకారణం. అసలు ఎవరీ భవిత.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఏంటి అని నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు. ఆ సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.
న్యూయార్క్ సిటీలో జరిగిన చానెల్ (Chanel) మెటియర్స్ డి’ఆర్ట్ 2026 ర్యాంప్‌ను ఓపెన్ చేసి ఫ్యాషన్ ప్రపంచంలో కొత్త స్టార్‌గా నిలిచింది భవిత మందవ. షోను ప్రారంభించే స్టార్ మోడల్‌గా అందరు మోడళ్ల కంటే ముందుగా వాక్ చేయడమే ర్యాంప్ ఓపెనింగ్ అంటారు. ఈ పాతికేళ్ల చిన్నది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాషన్ షోల్లో పాల్గొంటూ ర్యాంప్‌లలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
చానెల్ (Chanel) మెటియర్స్ డి’ఆర్ట్ 2026 ఓపెనింగ్ షోలో మొదటి లుక్ భవితది కావడం విశేషం. ఎందుకంటే ఇలా ఓ ఛానెల్ షోను ఓపెన్ చేసిన మొట్టమొదటి భారతీయ మోడల్‌గా ఘనత సాధించింది. ఫ్యాషన్ ప్రపంచంలో ఇది గొప్ప గౌరవం. ఈ గౌరవం ఆమెకి ఊహించని విధంగా వచ్చింది.
Also Read: https://teluguprabha.net/viral/indigo-flights-cancelled-techie-couple-online-reception-video/
భారత్‌లో ఆర్కిటెక్చర్ కోర్సు చదివిన భవిత.. అసిస్టివ్ టెక్నాలజీ కోసం అమెరికాలోని న్యూయార్క్ యూనివర్సిటీలో చేరింది. కానీ తాను ఫ్యాషన్ రంగంలోకి అడుగుపెడతానని అస్సలు ఊహించలేదట. న్యూయార్క్‌లో ట్రైన్ దిగిన అనంతరం సబ్‌వే స్టేషన్‌లో వస్తుండగా.. ఆ క్షణాలే ఆమె కెరీర్‌ను మలుపు తిప్పాయి. స్ప్రింగ్/సమ్మర్ 2025 సీజన్‌కు రెండు వారాల ముందు ఓ సబ్‌వే స్టేషన్‌లో భవిత మందవను గుర్తించిన ఒక స్కౌటింగ్ టీమ్.. ఈ షోను ఆమెను ఎంపిక చేసింది.
మొదటిసారి ఆమెను కాస్ట్ చేసిన మాథ్యూ బ్లేజీ.. ఫ్రెంచ్ ఫ్యాషన్ డిజైనర్, లగ్జరీ బ్రాండ్‌లలో క్రియేటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. “బొటేగా వెనెటా” అనే ఫ్రెంచ్-ఇటాలియన్ లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్‌లో క్రియేటివ్ డైరెక్టర్/డిజైనర్‌గానూ పనిచేశారు. ఈ క్రమంలో భవిత రన్‌వే అరంగేట్రం ప్రీమియం ఫ్యాషన్ బ్రాండ్ “బొటేగా వెనెటా”లోనే జరిగింది. దీంతో ఆయన మార్గదర్శకత్వంలో డిసెంబర్ 3న స్ప్రింగ్ 2026 కోసం మాథ్యూ రూపొందించిన తొలి చానెల్ (Chanel) మెటియర్స్ డి’ఆర్ట్ 2026 కలెక్షన్‌లో ఆమె ర్యాంప్ వాక్ చేసి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది.
bhavitha mandava just made history as the first indian model to open a chanel show — welcome fashion’s new it girl! 👛 pic.twitter.com/4hKCiyaZEm
— ✰ (@flyestdesi) December 5, 2025
ఇందుకు సంబంధించిన వీడియోను భవిత ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. బోవరీ స్టేషన్ మెట్లపై దిగుతూ ర్యాంప్‌పైకి అడుగుపెడుతోంది. ఈ షోను టీవీలో చూసిన భవిత తల్లిదండ్రులు భావోద్వేగానికి గురయ్యారు. సౌకర్యవంతమైన, చిక్ లేత గోధుమరంగు క్వార్టర్-జిప్ స్వెటర్, క్లాసిక్ డెనిమ్ జీన్స్‌ను భవిత ధరించింది. ఈ కాస్ట్యూమ్ సాధారణ గాంభీర్యాన్ని మోడ్రన్‌గా ప్రదర్శిస్తుంది. ఆమె ధరించిన సిగ్నేచర్ చానెల్ ఫ్లాప్ బ్యాగ్ క్లాసిక్ లుక్‌ను అందించింది. తన టాలెంట్, ఆత్మస్థైర్యంతో ఫ్యాషన్ ప్రపంచంలో భౌగోళిక సరిహద్దులు లేవని భవిత నిరూపించింది.

